2020లో దుమ్ములేపిన సిద్ శ్రీరామ్.. ఆ పాటలతో సెన్సేషన్

ఒకప్పుడు అంటే గాయకులు కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను అలరించారు. కానీ ఇప్పటి తరంలో మాత్రం మహా అంటే రెండు మూడేళ్లు మాత్రమే ఏ గాయకుడైనా వెలుగులో ఉంటున్నాడు. ఆ తరువాత మళ్లీ మరో కొత్త గాత్రం వినిపిస్తూ ఉంటుంది. అలా గతేడాదిలో సిద్ శ్రీరామ్, అనురాగ్ కులకర్ణి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సింగింగ్ సెన్సేషన్‌గా సిద్ శ్రీరామ్‌నే చెప్పుకుంటున్నారు.

అలా ఈ ఏడాదిలో సిధ్ శ్రీరామ్ పాడిన పాటలు తెలుగురాష్ట్రాలను ఊపేశాయి. గతంలో ఇంకేం ఇంకేం కావాలి, ఉండిపోరాదే, మాటే వినదుగా అనే పాటలతో యువతను ఉర్రూతలూగించాడు. అలా ఈ ఏడాదిలోనూ సిధ్ శ్రీరామ్ మ్యాజిక్ చేశాడు.అయితే ఈ సారి మాత్రం కేవలం యూత్‌నే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేశాడు. ముఖ్యంగా మహిళల కోసం పాడిన పాట బాగా క్లిక్ అయింది.

Sid sriram Is Singing Sensation In 2020

అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరగమన, వకీల్ సాబ్ చిత్రంలోని మగువా మగువా అనే పాటలు సోషల్ మీడియాను ఊపేశాయి. ఇవే కాకుండా సిధ్ శ్రీరామ్ పాడిన ఇంకొన్ని పాటలు కూడా క్లిక్ అయ్యాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే పాట, నిశ్శబ్దంలోని నిన్నే నిన్నే, ఒరేయ్ బుజ్జిగా, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, సోలో బ్రతుకే సో బెటర్ పాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇలా ఈ ఏడాది మొత్తంగా సిధ్ మ్యాజిక్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X