సిద్ శ్రీ రామ్ ఖాతాలో మరో రికార్డ్.. 100 మిలియన్స్ క్లబ్ లోకి మరో మెలోడీ సాంగ్
టాలీవుడ్ సింగర్స్ లో సిద్ శ్రీరామ్ హవా నడుస్తోంది. స్వతహాగా తెలుగు వాడు కాక పోయినా తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్నాడు. ఆయన చేత పాట పాడిస్తే కచ్చితంగా పాట హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన పాడిన ప్రతి పాట ట్రెండింగ్ లోకి వెళ్లడం పరిపాటిగా మారింది. సినిమా ఆడినా ఆడకపోయినా ఆయన పాటకు మాత్రం మినిమమ్ గ్యారంటీ వ్యూస్ దక్కడం ఖాయం గా మారిపోయింది. తాజాగా ఆయన ఖాతాలో మరో వంద మిలియన్ వ్యూస్ దక్కిన సాంగ్ చేరింది. ఆది సాయి కుమార్ =హీరోగా నటించిన శశి సినిమాలో ఈ ఒకే ఒక లోకం నువ్వు సాంగ్ మంచి క్రేజ్ సంపాదించింది.
శశి సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు అందించిన ఈ మెలోడీ సాంగ్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. 'ఒకే ఒక లోకం నువ్వే.. లోకం లోనా అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే' అంటూ సాగిన ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తూ 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ పాటను శ్రీ రామ్ తనదైన శైలిలో ఆలపించారు. సినిమా రిలీజ్ అయి పెద్దగా ఆడకపోయినా ఈ సాంగ్ కు మాత్రం ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు అని తాజా వ్యూస్ తో అర్థమవుతోంది.

ఇక తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా స్త్రీమ్ అవుతోంది. మొత్తం మీద 'ఒక లోకం నువ్వే' సాంగ్ ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయిందని చెప్పక తప్పదు. ''శశి'' సినిమాలో ఆది సాయి కుమార్ హీరోగా నటించగా సురభి - రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ - సి.రామాంజనేయులు - చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. .


Click it and Unblock the Notifications











