వరుసగా హిట్ల మీద హిట్లు.. ట్రెండింగ్‌లో సిధ్ శ్రీరామ్
ప్రస్తుతం దక్షిణాదికి మొత్తానికి మోస్ట్ వాంటెడ్ సింగర్ ఎవరని అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు సిధ్ శ్రీరామ్. సిధ్ శ్రీరామ్ గొంతు వినిపిస్తే చాలు ఆ పాట హిట్టే అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి సిధ్ శ్రీరామ్ తన గాత్రంతో దక్షిణాదిని కట్టిపడేస్తున్నాడు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ను తన వాయిస్‌తో కట్టిపడేశాడు. సిధ్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొడుతున్నాయి.
ఈ మధ్యే విడుదలై కొన్ని పాటలు కూడా సిధ్ శ్రీరామ్ వాయిస్‌లోని మ్యాజిక్‌ను మరోసారి చూపించాయి. యూత్‌ను, ప్రేమజంటను కట్టిపడేసేలా తన గొంతుతో మ్యాజిక్ చేయగలడు సిధ్ శ్రీరామ్. ఇంకేం ఇంకేం కావాలే అనే పాట దగ్గరి నుంచి సిధ్ శ్రీరామ్ తన పాటలతో మాయ చేస్తూనే ఉన్నాడు. సామజ వరగమనా, మగువా మగువా, నీలి నీలి ఆకాశం, ఒకే ఒక లోకం ఇలా ఎన్నో పాటలు ఆయన ఖాతాలో పడ్దాయి. తాజాగా తెలియదే తెలియదే అనే పాట సైతం ట్రెండ్ అవుతోంది.

హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి హీరోగా రమ్య పసుపులేటి హీరోయిన్‌గా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం మైల్స్ ఆఫ్ లవ్ . రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతమందించాడు. ఈ సినిమాలోని 'గగనం దాటే' తొలి పాటను జీ సరిగమ ఫేమ్ యశస్వి ఆలపించగా అది బాగానే క్లిక్ అయింది. ఇక సిద్ శ్రీరామ్ ఆలపించిన 'తెలియదే.. తెలియదే' అనే రెండో పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను తరుణ్ భాస్కర్ రిలీజ్ చేశాడు. అలా సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట శ్రోతలను కట్టిపడేస్తోంది. మొత్తానికి సిధ్ శ్రీరామ్ మాత్రం తన హవాను కొనసాగిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











