మణిరత్నం కోసం గాయకుడు సిద్ శ్రీరాం సరికొత్త అవతారం.. పాటతోనే కాకుండా...
గీతా గోవిందం, హుషారు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మలయాళ గాయకుడు సిద్ శ్రీరాం మరో సరికొత్త అవతారం ఎత్తున్నారు. ఇప్పటి వరకు తన గళంలో దక్షిణాది ప్రేక్షకులకు ఆకట్టుకొన్న సిద్ సంగీత దర్శకుడిగా మారబోతున్నారు. ఇటీవల కాలంలో సిద్ శ్రీరాం పాడిన పాటలకు విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.
తెలుగులో ఇంకేం ఇంకేం కావాలి, ఉండిపోరాదే.. తమిళంలో ఆడియే, యెనై మాత్రమ్ కాదలే, విసిరి, కురుంబా లాంటి పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం మణిరత్నం నిర్మాతగా రూపొందుతున్న తమిళ చ చిత్రం వానమ్ కొట్టాటమ్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

వానమ్ కట్టాటమ్ చిత్రంలో విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాజేష్ కలిసి నటిస్తున్నారు. ధన అనే యువ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల ప్రారంభమై ఈ ఏడాది చివరకు షూటింగ్ పూర్తి చేసుకొనేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమాకు తొలుత 96 ఫేమ్ గొవింద్ వసంత్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని అనుకొన్నాం. ఆయనతో సంప్రదింపులు కూడా జరిపాం. కానీ మా ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఆయన తప్పుకొన్నారు. దాంతో సిద్ శ్రీరాంను తీసుకోవాలని నిర్ణయించాం అని మణిరత్నం ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ అనంత్ మీడియాకు వెల్లడించారు.
వానమ్ కట్టాటమ్ సినిమా కోసం ఇప్పటికే సిద్ శ్రీరాం కసరత్తు మొదలుపెట్టారు. సరికొత్త సౌండ్‌తో ప్రేక్షకులను, సంగీత ప్రియులను థ్రిల్‌కు గురి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు ధనశేఖరన్‌తో కలిసి సిట్టింగులు జరుగుతున్నాయి అని తెలిపారు.


Click it and Unblock the Notifications











