మళ్లీ అదరగొట్టిన సిధ్ శ్రీరామ్.. మిలియన్ల వ్యూస్‌తో కుమ్మేస్తున్న టాప్ సింగర్

గత కొద్ది సంవత్సరాలుగా నేటి మేటి గాయకుడు సిధ్ శ్రీరాం అద్భుతమైన పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకొంటున్నారు. గీతా గోవిందం, హుషారు చిత్రాల్లోని పాటలు ఆయనకు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను, ఇండస్ట్రీలో మంచి డిమాండ్‌ను సంపాదించిపెట్టాయి. తాజాగా మరోసారి తన గళంలో సిద్ద్ శ్రీరాం మ్యాజిక్ చేశారు. తాజాగా డియర్ మేఘ సినిమా కోసం పాడిన పాటలు యువతను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొంటున్నాయి.

డియర్ మేఘ సినిమా కోసం సిధ్ శ్రీరాం పాడిన ఆమని పక్కన ఉంటే పాటను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రిలీజ్ చేయగా కొద్ది సమయంలోనే 2 మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. ఆ పాటకు వస్తున్న స్పందనను చూసి తాజాగా బాగుంది ఈ కాలమే అనే లిరికల్ సాగ్‌ను గురువారం జూన్ 29వ తేదీన రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం విశేషంగా మారింది.

Sid Srirams Dear Megha song goes viral

ఊరికే ఇంత కాలం ఉంటున్నా...
ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..
వెన్నెలే ఒంటి మీద వాలేనా..
తారలేమో కంటిలోన ఈదేనా...
ఒక్కటై, చేరగా..
దిక్కులే మారెనా..
దూరమే పోయెనా, వేదనే తీరెనా...
బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అద్బుతమైన సాహిత్యంతో ఫీల్‌గుడ్‌గా ఈ పాట సాగింది. గేయ రచయిత కృష్ణ కాంత్ ఈ పాటను రాయగా. సంగీత దర్శకుడు హరి గౌర అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ చిత్రం అతి త్వరలో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు,
రచన, దర్శకత్వం: సుశాంత్ రెడ్డి
నిర్మాత: అర్జున్ దాస్యన్
బ్యానర్: వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్
సంగీతం: హరి గౌర
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి,
ఆర్ట్ డైరెక్టర్: పీఎస్ వర్మ
ప్రొడక్షన్ కంట్రోలర్: నాగ మధు
పీఆర్వో: జీఎస్కే మీడియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X