Legend Singer దారుణ హత్య.. సినీ ప్రముఖుల తీవ్ర దిగ్బ్రాంతి

పంజాబీ సింగర్, రాజకీయ నేత సిద్దూ మూస్‌వాలా హత్యా సంఘటన సినీ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సిద్దూ మూస్ మరణంపై ఎంతో మంది అభిమానులను కలతకు గురిచేసింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు బాలీవుడ్ స్టార్స్, యాక్టర్లు సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. సిద్దూ మూస్ మరణం గురించి, సినీ నటుల ఆవేదన గురించి వివరాల్లోకి వెళితే..

సిద్దూ మూస్‌వాలాను పంజాబ్‌లోని మన్సా అనే గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చులు జరిపారు. రక్తమడుగులో పడిఉన్న ఆయనను స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌కు చేరే లోపే అతడు తుదిశ్వాస విడిచారు అని వైద్యులు ధృవీకరించారు.

Sidhu Moose Wala death: Ranveer singh, Vikcky Kaushal, Lilly Singh condemn

సిద్దూ మూస్‌వాలా కెరీర్ విషయానికి వస్తే.. లెజెండ్, డెవిల్, జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్ట్ జాట్ దా ముకాబలా, బ్రౌన్ బాయ్స్, హత్యార్ లాంటి సూపర్ హిట్ పాటలను అందించారు. ఆయన పాడిన చివరి పాట ది లాస్ట్ రైడ్.

సిద్దూ మూస్‌వాలా దారుణ హత్యకు గురయ్యారనే వార్త తెలుసుకొన్న బాలీవుడ్ సినీ ప్రముఖులు రణ్‌వీర్ సింగ్, వికీ కౌశల్, షెహనాజ్ గిల్, విశాల్ దల్దానీ, కపిల్ శర్మ, లిల్లీ సింగ్ తదితరులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్ మీడియా ద్వారా శ్రద్దాంజలి ఘటించడమే కాకుండా దారుణ హత్యను ఖండించారు.

సిద్దూ మూస్‌వాలా హత్య దారుణం. పంజాబ్ మ్యూజిక్ రంగానికి ఎనలేని సేవ చేస్తున్న ఆయనను చంపడం మరీ దారుణం. సిద్దూ మూస్‌వాలా ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. అభిమానులు, సంగీత ప్రియులు, సినీ తారలు #RIPLegend అంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X