Simbu's The Life of Muthu నిన్నే తలదన్నే సరిజోడి నాకిక లేదే.. శింబు రొమాంటిక్‌గా
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కే గణేష్ నిర్మించిన ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా సెప్టెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగాప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాను తెలుగులోప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నది. ఈ చిత్రంలో శింబు, సిద్ధి ఇద్నానీ జంటగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి.
ఈ నేపథ్యంలో నిన్నే తలదన్నే సరిజోడి నాకిక లేదే.. నా కల్లో కూడా నీవు నేను వేరే వేరే కాదే.. నాతోనే రా.. రా అనే పాటను రిలీజ్ చేశారు. శింబు, సిద్ది ఇద్నానీపై చిత్రీకరించిన ఈ పాట మెలోడిగా సాగింది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ అందించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. సామ్ విశాల్, రక్షితా సురేష్ ఆలపించారు.

ఇషారీ కే గణేష్ నిర్మిస్తున్న ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా యాక్షణ్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. చిత్రంలో రాధిక శరత్ కుమార్ ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఏపీ, నైజాంలో భారీగా రిలీజ్ చేస్తున్నారు.
శింబు నటించిన చిత్రం చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దాంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











