ఆశ కల్పించి బాలీవుడ్ సింగర్‌ని ఎంత దారుణంగా మోసం చేశారో తెలుసా!
బాలీవుడ్ ప్రముఖ సింగర్ అనురాధ పాడ్వాల్‌ని ఏడుగురు బిల్డర్లు వంచించారు. ఈ నేపథ్యంలో వారిపై అనురాధ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఓ ప్లాట్ కొనుగోలు విషయంలో అనురాధా మోసపోయినట్లు తెలుస్తోంది. ఆ ఏడుగురు బిల్డర్లపై ఆర్నాల కోస్టల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
తక్కువ ధరకే ఫ్లాట్ అని ప్రకటన ఇవ్వడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఎగబడ్డట్లు తెలుస్తోంది. అనురాధ కూడా ప్లాట్ కొన్నారు. కానీ బిల్డర్లు నకిలీ పత్రాలు సృష్టించి ఒకే ప్లాట్ ని చాలా మందికి అమ్మినట్లు తెలుస్తోంది. వీరి ఘరానా చీటింగ్ లో అనురాధ కూడా మోసపోయారు.

వాస్తవం తెలుసుకున్న ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం కూడా గాలింపు మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications











