అర్జిత్ సింగ్ ను హఠాత్తుగా లాగేసిన మహిళ.. ఇలా చేస్తే నేను వెళ్లిపోతాను అంటూ వాగ్వివాదం..
అర్జిత్ సింగ్.. తన అద్భుతమైన గొంతుతో అందరినీ అలరించడం ఆయన ప్రత్యకత. గాయకుడిగా, స్వరకర్తగా, సంగీత నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఆయన ఔరంగాబాద్ లో ఓ ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ ఘటనతో ఆయన చేతికి దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఔరంగాబాద్ లో ప్రదర్శన జరుగుతుండగా.. ఓ మహిళా అభిమాని ఆయన చేయి పట్టుకొని కిందకు లాగింది. ఆయన స్టేజీ మీద ఉండగా అలా లాగడంతో ఆయన చేతికి దెబ్బ తగిలింది. ఈ ఘటనతో ఆయన కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు అలా ఎలా చేస్తారు.. నేను పాడే పాటతో మీరు చాలా హాయిగా గడిపారు. ఇలా చేస్తే నేను వెళ్లిపోతాను. అప్పుడు మీరెలా ఎంజాయ్ చేయగల్గుతారు. ఇలా చేయడం సరైన పద్దతేనా, నా చేతిని ఎందుకు లాగారు" అంటూ మహిళను అడిగారు.

అలాగే ఇప్పుడు నా చేయి వణుకుతోంది, నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా అంటూ అర్జిత్ సింగ్ గట్టిగా ఫైర్ అయ్యారు. దీంతో ప్రేక్షకులంతా వద్దు వద్దు అని కేకలు వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ అలా చేయి లాగడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒ కళాకారుడు గంటల తరబడి మనకోసం ప్రదర్శన ఇస్తుంటే మనం ఇలా చేయడం తప్పంటూ చెప్పుకొస్తున్నారు.
ఓ నెటిజెన్ అయితే.. తాను పాట పాడుతూ చాలా బిజీగా ఉన్న సమయంలో అభిమానులు ఆయన చేయిని లాగుతారని ఆయన ఊహించి ఉండరని రాసుకొచ్చాడు. ఇలా చేయడం వల్ల ఆయన చేతికి గాయమైందని ఓ ఫొటోను షేర్ చేశాడు. మనం గౌరవంగా వ్యవహరిస్తూ సంగీతాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప ఇలా చేయకూడదంటూ హితవు పలికాడు. అలాగే అర్జిత్ సింగ్ బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించాడు.
అర్జిత్ సింగ్ ఓపిక, సహనానికి హాట్సాఫ్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. చేయి పట్టి లాగిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివరిస్తున్నారు. మరికొందరేమో.. నిజమైన అభిమానులు ఎవరూ అలా చేయరని, ఆమె కావాలనే అలా చేసి ఉంటుందని చెప్పాడు. ఇండస్ట్రీలో అందరితో బాగుండే, అద్భుతమైన ప్రవర్తన కల్గిన వారిలో అర్జిత్ సింగ్ ఒకడని మరో అభిమాని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











