మీ పార్టీతో సంబంధం ఉన్న ఆ రైటర్ వేదించాడు.. చర్యలు తీసుకోండి.. సీఎంకు చిన్మయి కంప్లైంట్
సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న చిన్మయి వివిధ సామాజిక అంశాలపై తరచుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమె మీటు ఉద్యమానికి కూడా సరికొత్త ఊపునిచ్చి అప్పట్లో స్టార్ రైటర్ పేరు కూడా ఓపెన్ గా బయటకు చెప్పింది. అతని కారణంగా తను చాలా ఇబ్బంది పడ్డాను అని అలాగే మరి కొంతమంది అమ్మాయిలు కూడా ఇబ్బంది పడినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే మరోసారి సోషల్ మీడియా ద్వారా ఆమె సీఎంకు కూడా అతనిపై కంప్లైంట్ చేయడం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత్ రెజ్లింగ్ క్రీడాకారుల ఆరోపణలు: భరత్ రెజ్లర్ సమాఖ్యలో రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకి పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ భారత్ రెజ్లింగ్ క్రీడాకారులు అందరూ గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారిణిలు ధర్నా నిర్వహించి కొత్త పార్లమెంట్ భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

సింగర్ చిన్మయి రియాక్షన్: దీంతో రెజ్లింగ్ క్రీడాకారిణిలకి, పోలీసులకి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై బీజేపీయేతర పార్టీలు అన్ని మోడీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి. ఢిల్లీలో ఘటనని ఖండించాయి. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యి రెజ్లర్ పై జరిగిన దాడిని ఖండించారు. దీనిని ఉదాహరణగా చూపిస్తూ ఇప్పుడు సింగర్ చిన్మయి స్టాలిన్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ఇక ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటిలానే ఆమెకు నెటిజన్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది.

మీరు అండగా నిలబడాలని: రెజ్లర్ కి అండగా నిలబడినట్లు వైరిముత్తు లైంగిక వేదింపులకి బలైన తమలాంటి వారికి కూడా మీరు అండగా నిలబడాలని చిన్మయి కోరింది. వైరిముత్తుపై కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకొని తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కోలీవుడ్ చిత్రపరిశ్రమలో చాలా మంది చాలా మంది అమ్మాయిలు ముందుకొచ్చి వైరిముత్తు తమని లైంగికంగా వేధించాడని గతంలో ఆందోళన చేశారు. చిన్మయి ముందుండి వారిని నడిపించింది. ఇక వైరిముత్తు మీద ఎలాంటి కేసు పెట్టకపోగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చిన్మయిని నిషేధించారు.

వారిని ఇరుకున పెట్టే విధంగా..: ఇప్పుడు రెజ్లర్ లకి స్టాలిన్, కమల్ హాసన్ లాంటి వారు మద్దతుగా మాట్లాడటంతో చిన్మయి వారిని ఇరుకున పెట్టే విధంగా తనకి న్యాయం చేయాలని వరుస ట్వీట్ లతో కోలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. మరి చిన్మయిపై వైరిముత్తు వేధింపులపై స్టాలిన్ రియాక్ట్ అయ్యి న్యాయం చేస్తారా, అస్సలు రియాక్ట్ కావడమే మానేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరో వైపు తమిళనాడులో బీజేపీ నాయకులు ఇప్పుడు చిన్మయికి మద్దతుగా నిలబడుతూ రెజ్లర్ వేధింపుల గురించి స్పందిస్తున్న ముఖ్యమంత్రి గారు సొంత రాష్ట్రంలో ఒక తమిళమ్మాయికి జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించరు. వైరిముత్తుపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











