సమంత.. నిన్ను ప్రేమించే వాళ్లు.. నాగచైతన్యకు సింగర్ చిన్మయి కౌంటర్

యువ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న ఖుషీ మూవీ సినిమా మ్యూజికల్ నైట్ వేడుక హైదరాబాద్‌లో భారీగా నిర్వహించారు. ఈ వేడుక కోసం అభిమానులు, సంగీత ప్రియులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో గాయకులు సిద్ శ్రీరాం, చిన్మయి ఇతర సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బృందం పాల్గొన్నారు.

ఖుషి మ్యూజికల్ ఈవెంట్‌లో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంత, ఆనంద్ దేవరకొండ, నవీన్ ఎర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమంత గురించి సింగర్ చిన్మయి స్పీచ్ వైరల్ అయింది. ఆ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

Singer Chinmayi Samantha

ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో సింగర్ చిన్మయి జోష్‌తో కనిపించారు. వేదికపై తన గానమాధుర్యంతో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నారు. ఆద్యంతం చిన్మయి హుషారుగా గంతులేస్తూ పాటలతో ఉత్సాహ పరిచింది. ఈవెంట్ ముగింపులో మాట్లాడుతూ చిన్మయి భావోద్వేగానికి గురైంది. సమంతపై ప్రేమ, అభిమానాన్ని కురిపించింది.

ఖుషి ఈవెంట్‌లో చిన్మయి మాట్లాడుతూ.. సమంత నీ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది మీ వల్లే. నీవు చాలా మందికి ఇన్స్‌పిరేషన్. చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు నీవు హీరోవి. సమంత స్వతహాగానే ధైర్యవంతురాలు. చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి. ఎవరు ఏమనుకొన్నా మానవతావాది. సమంతను ప్రేమించే వారు ఈ విషయాలనే చెబుతారు అని చిన్మయి అన్నారు.

Samantha Kushi Musical Concert

సమంతపై మాటలతో ప్రేమను కురిపించడమే కాకుండా పాటతో కూడా తన అభిమానాన్ని చాటుకొన్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన అమృత సినిమాలోని ఏ దేవీ వరమో నీవు పాటను పాడి చిన్మయి ఆకట్టుకొన్నది. చిన్మయి చూపించిన ప్రేమలో సమంత తడిసి ముద్దైంది. చిన్మయి మాటలతో పొంగిపోయిన సమంత తన స్నేహితురాలిని కౌగిలించుకొన్నది.

Samantha Vijay Deverakonda

అయితే సమంతను ఆకాశానికి ఎత్తేస్తూ.. నాగచైతన్యను టార్గెట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సమంతను ప్రేమించే వారు అంటూ కామెంట్ చేయడం హైలెట్ అయింది. ప్రేమించని వారిపై చిన్మయి సెటైర్ వేసిందా? అంటూ కొందరు అనుకోవడం ఈవెంట్‌లో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X