Ben 10: చిన్నారులకు గుడ్ న్యూస్.. బెన్ 10 కోసం పాట పాడిన తెలుగు సింగర్!

తెలుగు సహా తమిళ సినిమా దగ్గర బాగా సుపరిచితం అయ్యిన పలువురు ప్రముఖ లేడీ సింగర్స్ చాలా మందే ఉంటారు కానీ కొంచెం కాంట్రవర్సియల్ గా ఎప్పటికప్పుడు ఏదొక విషయంలో వినిపించే లేడీ సింగర్ మాత్రం ఒకే ఒక్కరు ఉన్నారని చెప్పాలి. కాగా సినీ పరిశ్రమకి చెందిన ఆడవాళ్ళలో కానీ బయట జరిగే దారుణ ఘటనల విషయంలో కానీ మొదట స్పందించేది కూడా ఆమె అని చెప్పాలి.

మరి ఆమె ఎవరో కూడా కాదు సింగర్ చిన్మయినే.. మన టాలీవుడ్ కి కోలీవుడ్ కి ఫెమినిస్ట్ గా ఈమె పేరు బాగా తెలుసు.. కాగా చిన్మయి చాలా సినిమాలకి పాటలు పాడటం పలు అవార్డులు గెలుచుకోవడం అలాగే ఆమె సింగర్ గానే కాకుండా పలువురు హీరోయిన్స్ కి కూడా డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచింది. మెయిన్ గా స్టార్ బ్యూటీ సమంతకి డబ్బింగ్ చెప్పిన తర్వాత నుంచి చిన్మయి కోసం చాలా ఎక్కువ మాట్లాడుకోవడం జరిగింది.

singer chinmayi Sripada sang title song of ben 10

అయితే టాలీవుడ్ లో సంచలన కేసు జానీ మాస్టర్ విషయంలో కూడా ఆమె పలు సంచలన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే దాదాపు తన సోషల్ మీడియా అంతా కూడా మొత్తం కాంట్రవర్సీలు కామెంట్స్ కి రిప్లై లతోనే ఫిల్ అయ్యిపోయి కనిపించేది. కానీ చాలా కాలం తర్వాత తన ఫాలోవర్స్ కి ఒక ఊహించని ట్విస్ట్ ని అందించింది అని చెప్పాలి.

కాగా ఒకో జెనరేషన్ యువతలో కార్టూన్స్ పరంగా కొన్ని క్లాసిక్ షోస్ ఉంటాయి. అలా 90స్ కిడ్స్ లో కూడా ఫేమస్ కార్టూన్ సూపర్ హీరో షో "బెన్ 10" కూడా ఒకటి. మరి ఈ షోలో వచ్చే టైటిల్ సాంగ్ ని పాడింది చిన్మయినే అట.. అవును ఇది 90స్ కిడ్స్ ఎవరైనా చదువుతుంటే డెఫినెట్ గా షాక్ అవ్వాల్సిందే. అసలు ఊహించని గొంతు మాడ్యులేషన్ తో వినిపించే ఆ సాంగ్ ని చిన్మయి పాడింది అంటే ఎవరూ నమ్మలేరు.

singer chinmayi Sripada sang title song of ben 10

కాగా దీనిపై క్లారిటీ ఇస్తూ ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో కూడా పోస్ట్ చేసింది. బెన్ 10 తెలుగు తమిళ్ వెర్షన్స్ లో పాటలు పాడింది నేనే అని లైవ్ లో రెండు భాషల్లో కూడా పాడి మరీ వినిపించింది. దీనితో ఇది చూసిన నెటిజన్స్ చిన్మయి విషయంలో ఒకింత షాక్ కి గురవుతున్నారు. నిజానికి ఆ సాంగ్ ఎవరో చిన్న పిల్లాడి చేత పాడించినట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎవరు విన్నా కూడా అదే నిజం అనుకుంటారు.

కానీ ఆ సాంగ్ ని ఒక అమ్మాయి అది కూడా చిన్మయి పాడింది అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. దీనితో ఇపుడు ఈమె వీడియో వైరల్ గా మారింది. ఇక చిన్మయి పాటలు, డబ్బింగ్ మాత్రమే కాకుండగా సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. తన భర్త రాహుల్ రవీంద్రన్ తెలుగు సహా తమిళ్ హిందీ చిత్రాల్లో నటుడుగా కొనసాగుతున్నాడు. మరి అతను నటించిన బాలీవుడ్ చిత్రం ఆలియా భట్ నటించిన "జిగ్ర" ఈ దసరా కానుకగా రిలీజ్ కి వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X