RIP KK: వారి నిర్లక్ష్యం, చివరి క్షణంలో ఇబ్బందిగానే ఫ్యాన్స్ కోసం పాటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్

ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణ కుమార్) మృతి చెందడం సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. చాలామంది సంగీత ప్రియులు అతని మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోని అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఈ గాయకుడికి ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే అభిమానులు కూడా అదే తరహాలో నివాళులర్పిస్తున్నారు. సింగర్ KK మృతిపై చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు ఆ ఈవెంట్ కు వెళ్లకపోయి ఉంటే అతను బ్రతికి ఉండేవాడు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఒక వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఈవెంట్ లో కేకే పడిన ఇబ్బంది పడిన వివరాల్లోకి వెళితే..

Recommended Video

Singer KK Passes Away At 53, PM Modi Pays Tribute #Bollywood | Telugu Filmibeat
పవర్ఫుల్ ఎనర్జీతో..

పవర్ఫుల్ ఎనర్జీతో..

కోల్‌కతాలో కేకే ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్ లో భారీ స్పందన వచ్చింది. అభిమానులు కేకే లైవ్ మ్యూజిక్ కోసం భారీ బందోబస్తు కూడా నిర్వహించాల్సి వచ్చింది. ఆడియన్స్ ను చూస్తే కేకే మాత్రం ప్రతి సారి పవర్ఫుల్ ఎనర్జీతో కనిపిస్తూ ఉంటాడు.
వారికి ఇష్టమైన భిన్నమైన పాటలను పాడుతూ వారికి మంచి బూస్ట్ ఇస్తూ ఉంటాడు.

 ఆరోగ్యం విషయంలో..

ఆరోగ్యం విషయంలో..

కేకేను చూడడానికి అప్పుడే 30 ఏళ్ళ వయసులో కి వచ్చిన యువకుడిలా కనిపిస్తాడు. కానీ ఆయన అసలు వయసు 53 ఏళ్లు. కానీ ఆ వయసుకు తగ్గట్టుగా అతను కనిపించాడు. ఎందుకంటే కేకే ఫిట్నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా యోగా వర్కౌట్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటాడు. అందుకే ఈ తరహా లో అతను తన లుక్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.

 వేడి ఎక్కువగా ఉన్నా..

వేడి ఎక్కువగా ఉన్నా..

కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్ లో కేకే చాలా ఇబ్బంది పడ్డారు. నజ్రుల్‌ మంచాలోని గురుదాస్‌ కాలేజ్‌ వద్ద జరిగిన కాన్సెర్ట్‌ లో పాల్గొన్న కేకే మొదట్లో ఉషారుగా కనిపించి కొన్ని పాటలు పాడారు. ముందుగానే కేకే అసిస్టెంట్స్ అక్కడ సరిగ్గా సదుపాయాలు లేవని మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది. కానీ కేకే అవేవి పట్టించుకోకుండా ఫ్యాన్స్ భారీగా రావడంతో వారి కోసం అక్కడ వేడి ఎక్కువగా ఉన్నా కూడా పాటలు పాడారు.

విపరీతమైన చెమటలు..

విపరీతమైన చెమటలు..

ఇక కేకే కొంత సమయం తరువాత చాలా ఇబ్బందికి లోనయ్యారు. ఆ హాల్ లో ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్‌ కూడా లేదు. దీంతో కేకే విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. అందుకు సంబంధించిన చివరి విడియో కూడా సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. చెమటలతో ఇబ్బంది పడుతున్న కేకే మొహం తుడుచుకున్నట్లు ఉన్నాడు.

 ఆఖరి వీడియో వైరల్

ఆఖరి వీడియో వైరల్

ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు కేకే మృతికి నిర్వాహకులు కూడా కారణం అని అంత వేడిగా ఉండే డీహైడ్రేషన్‌ వల్లే స్ట్రోక్స్‌, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హోటల్ కు తిరిగి వచ్చిన అనంతరం కేకే గుండెనొప్పితో కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక తలకు గాయం అయినట్లు కూడా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X