RIP KK: కోటి ఇచ్చిన అక్కడ మాత్రం పాడనని చెప్పిన సింగర్.. ఒక్క పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే?

ప్రముఖ సింగర్ కేకే మరణించడం సంగీత ప్రపంచాన్ని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎలాంటి పాట అయినా సరే తనదైన శైలిలో పాడుతూ ఆ పాటకు ప్రాణం పొసే అతికొద్దిమంది సింగర్స్ లో కేకే ఒకరు. గత 20 ఏళ్లుగా సంగీత ప్రపంచంలో ఎంతో బిజీగా కొనసాగుతున్న కేకే హటాత్తుగా మరణించడం తీరని లోటు అని సంగీత ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే సింగర్ గా కేకే ఎంతో క్రేజ్ అందుకున్నాడు. అలాగే అతని వ్యక్తిత్వం విషయంలో కూడా అంతే నిబద్ధతతో ఉన్నాడు. కోట్లు ఇచ్చినా కూడా ఒక దగ్గర మాత్రం అతను పాటలు పాడను అని వివరణ ఇచ్చాడు. ఇక ఒక్క పాటకు ఎంత పారితోషకం తీసుకుంటాడు అనే వివరాల్లోకి వెళితే..

 వివిధ భాషల్లో

వివిధ భాషల్లో

భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సింగర్ కేకే అసలు పేరు కృష్ణకుమార్ కున్నాత్. కోల్కతాలో చెందిన ఈ సింగర్ హిందీ తమిళం మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ భిన్నమైన భాషల్లో కూడా తన గొంతును వినిపించాడు. సంగీత ప్రపంచంలో ఎన్నో వైవిధ్యమైన వందలాది పాటలతో ఆకట్టుకున్నాడు.

హఠాత్తుగా అస్వస్థత..

హఠాత్తుగా అస్వస్థత..

మంగళవారం రోజు రాత్రికోల్‌కతాలో ఒక ఈవెంట్ లో కేకే అభిమానులకు నచ్చిన పాటలను పాడుతూ ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందిగా ఉంది అని తెలియడంతో వెంటనే అతను తన హోటల్ కు వచ్చి విశ్రాంతి తీసు కోవాలని అనుకున్నాడు. ఇక ఆ తర్వాత మేనేజ్మెంట్తో ఆరోగ్యం బాగోలేదు అని చెప్పడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

హాస్పిటల్ కి వెళ్లే లోపే..

హాస్పిటల్ కి వెళ్లే లోపే..

ఇక హాస్పిటల్ కి వెళ్లే వరకు కూడా కేకే కొంత బాగానే ఉన్నప్పటికీ అతను వైద్యుల వద్దకు చేరుకునే క్రమంలోనే ప్రాణాలు వదిలేశాడు. కేకే మరణించాడు అని తెలియగానే సంగీత ప్రపంచంలోని చాలా మంది అభిమానులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.. ఇది నమ్మలేక పోతున్నాము అంటూ ప్రముఖ సంగీత దర్శకులు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

తెలుగులో బెస్ట్ సాంగ్స్

తెలుగులో బెస్ట్ సాంగ్స్


కేకే హిందీలో ఎన్నో వైవిధ్యమైన పాటలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హిమేష్ రేష్మియా సంగీత దర్శకత్వంలో అతను పాడిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ఇక తెలుగులో అయితే ఖుషి సినిమాలోని యే మే రాజహా పాట ఇప్పటికీ ఆల్ టైం బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఆర్య 2 సినిమాలోని గుప్పెడంత ఈ ప్రేమకి అనే పాట కూడా ఆల్ టైమ్ బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఒకటి అని చెప్పవచ్చు.

కోటి ఇచ్చినా అక్కడ పాడను

కోటి ఇచ్చినా అక్కడ పాడను

అయితే సింగర్ కేకే సినిమాల్లో పాటలు పాడే ముందు ముందుగా ట్యూన్ తనకు నచ్చితేనే పాడడానికి ఒప్పుకునే సింగర్. అంతే కాకుండా అతను ఒక నిబద్ధతతో కూడిన సంగీత కళాకారుడిగా ఇండస్ట్రీలో కొనసాగాడు. ఎక్కువగా గా ధనవంతులు నిర్వహించే పార్టీలలో అలాగే పెళ్లిళ్లలో ఏమాత్రం పాటలు పాడనని కోటి రూపాయల ఆఫర్ ఇచ్చినా పాడనని కూడా గతంలో క్లారిటీ ఇచ్చాడు. కేవలం ఫ్యాన్స్ నిర్వహించే ఈవెంట్లలో మాత్రమే పాటలు పాడుతానని కూడా ఆ మధ్యన వివరణ ఇచ్చాడు.

ఒక్క పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే?

ఒక్క పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే?

అయితే ఒక్క పాటకు ఈ సంగీత కళాకారుడు ఎంత పారితోషికం తీసుకుంటాడు అనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ కేకే కొన్నిసార్లు ట్యూన్ నచ్చితే తక్కువ పారితోషికం కూడా తీసుకున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఒక్క పాటకు కేకే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో తీసుకుంటాడు అని సమాచారం. ఇక సింగర్స్ పెళ్లిల్లలో ధనవంతుల ప్రయివేట్ పార్టీలలో పాటలు పాడుతూ నెలలోనే కోట్ల ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. కానీ KK అలా డబ్బు సంపాదించేందుకు ఇష్టపడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X