Singer KK no more..కేకే ప్రేమకథ వింటే కంటతడి పెట్టాల్సిందే.. భార్య జ్యోతితో లవ్ స్టోరి ఎక్కడ మొదలైందో తెలుసా?
ఇండియన్ మ్యూజిక్ ప్రపంచంలో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే. ఆయన జీవితం అర్ధాంతరంగా ఆగిపోవడం కోట్లాది మంది భారతీయ సంగీత అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆయన మరణం తన భార్యను గుండె పగిలేలా చేసింది. కేకే, ఆయన భార్య జ్యోతి ప్రేమ కథ అందర్ని భావోద్వేగానికి గురిచేయడం ఖాయం.. వారి ప్రేమ కథ గురించి మీ కోసం వివరంగా..

6వ తరగతిలోనే పరిచయం
గాయకుడు కేకే, జ్యోతి లక్ష్మి మధ్య ప్రేమ తొలిచూపులో చిగురించింది కాదు. ఇద్దరు ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించింది. వారి వయసు పెరుగుతున్న కొద్ది వాళ్ల మధ్య పరిచయం, స్నేహం పరిణతి చెంది వారి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. వారిద్దరి జీవితం ఎందరికో స్పూర్తిగా నిలిచేలా చేసింది.

ప్రేమకు చిరునామాగా సృజనాత్మకత
గాయకుడు కేకే భార్య జ్యోతి లక్ష్మి మంచి చిత్రకారిణి. తన ఆలోచనలకు అందమైన క్యాన్వాస్ చిరునామాగా మారింది. అద్బుతమైన చిత్రలేఖన ప్రతిభతో అపురూమైన చిత్రాలను అందించింది. గాయకుడిగా కేకే, ఆర్టిస్టుగా తమ ఆలోచనలు వారి ప్రేమకు బలంగా మారాయి.

సేల్స్‌మెన్‌గా కేకే
కేకే గాయకుడిగా మారకముందు ఆయన జీవితం అనేక ఆటుపోట్లకు గురైంది. జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, తన ఆశలను, ఆకాంక్షలను సాకారం చేసుకొనేందుకు ముంబైలో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే అంటే.. 1991లో కేకే, జ్యోతి పెళ్లి చేసుకొన్నాడు. గాయకుడు కావాలనే కేకే బలమైన కోరికకు జ్యోతి అండగా నిలిచారు.

కేకే ఆశలకు అండగా జ్యోతి
భార్య జ్యోతి అందించిన ప్రోత్సాహంతో సేల్స్ మ్యాన్ ఉద్యోగం మానేసి.. గాయకుడిగా అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు. అలా చాలా ప్రయత్నాల తర్వాత 1994 సంవత్సరంలో వ్యాపార ప్రకటనలకు జింగిల్స్ పాడే అవకాశం లభించింది. అలా అవకాశాలను అందిపుచ్చుకొన్న కేకే బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాపులారిటిని సంపాదించారు.

ఫ్యామిలీలో కేకే ఎమోషనల్‌గా
గాయకుడుగా కేకే పాపులారిటీని సంపాదించినా విలువలను వదులుకోలేదు. కుమారుడు నకుల్ కృష్ణ కున్నత్, కూతురు తమారా కున్నత్, భార్య జ్యోతితో కుటుంబ జీవితాన్ని ఆస్వాదించారు. ఇలా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న కేకేను మృత్యువు ఆకస్మికంగా కబలించింది. మే 31వ తేదీన కోల్‌కతాలో సంగీత విభావరి నిర్వహిస్తూ అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికే ఆయన తుదిశ్వాస విడిచారు.

భార్యను ఓదార్చడం ఎవరితరం..
గాయకుడు కేకే ఇకలేరనే వార్త అర్ధరాత్రి దావానలంగా సంగీత ప్రపంచాన్ని విషాదానికి గురిచేసింది. అర్ధరాత్రే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ఇక భర్త ఇకలేరనే వార్తతో జ్యోతి సంగీత సాగరంలో మునిగింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు అని సన్నిహితులు తెలిపారు.

సీబీఐ దర్యాప్తు చేయాలనే డిమాండ్
ఇక కేకే మరణాన్ని అసహజ మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేకే మరణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కేకే భౌతికంగా దూరమైనా.. ఆయన మ్యూజిక్ అభిమానుల్లో హృదయాల్లో ఉండటం తథ్యం.


Click it and Unblock the Notifications











