Singer KK Telugu Top songs: ఎన్ని పాటలు వచ్చినా ఆ 10 పాటలు ది బెస్ట్.. తెలుగంటే అతనికి అంత ఇష్టం!
సంగీత ప్రపంచంలో తీరని విషాదం చోటుచేసుకుంది ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) ఇటీవల గుండెపోటుతో మరణించడంతో ఒక్కసారిగా సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయింది. అతను తుది శ్వాస విడిచే ముందు వరకు కూడా పాటలతో మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చాడు. హటాత్తుగా గుండెపోటు రావడంతో ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. ఇక అతను మరణించినప్పటికీ కూడా అతను పాడిన పాటలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనివి అని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఇక కేకే తెలుగులో కూడా చాలా మంచి పాటలను పాడారు. ఇక అందులో టాప్ 10 సాంగ్స్ వివరాల్లోకి వెళితే..

తెలుగంటే అంత ఇష్టం
ఒక విధంగా తెలుగు భాష అంటే సింగర్ కేక్ కు చాలా ఇష్టం. అందుకే అతను తెలుగు పదాలను అర్థం చేసుకుని ఏమాత్రం పొరపాట్లు లేకుండా పాడేవాడు. నార్త్ సింగర్స్ తెలుగు భాషను అర్థం చేసుకోకుండా చాలా తప్పుగా వాడేవారు అని ఒక విమర్శ అయితే ఉంది. అయితే కేకే మాత్రం ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా వీలైనంతవరకు పదాలను అర్థం చేసుకొని వాటిని తెలుగు వారికి నచ్చే విధంగా పాడేవాడు. అందుకే అతని పాటలు తెలుగులో ఆల్ టైం బెస్ట్ హిట్ సాంగ్స్ లో ఒకటి గా నిలుస్తాయి.

ఏ మేరా జహా
తెలుగులో కూడా సింగర్ కేకే చాలా విభిన్నమైన పాటలను పాడాడు. మొదటి అతను ఖుషి సినిమాలో పాడిన పాట ఎంతగానో క్రేజ్ అందుకుంది. ఇప్పటికి కూడా పవన్ ఫ్యాన్స్ మర్చిపోలేని ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్స్ లో 'ఏ మేరా జహా' టాప్ లిస్టులో ఉంటుంది. అప్పట్లో ఈ పాటకు థియేటర్లు షేక్ అయ్యాయి. అలాగే గుడుంబా శంకర్ సినిమాలో కూడా 'లే లే ఇవాలే లే లే' అనే పాట కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా కేకే పాడాడు.

బెస్ట్ లవ్ సాంగ్స్
ఆర్య సినిమాలో కూడా 'ఫీల్ మై లవ్' అనే సాంగ్ ఇప్పటికికూడా బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఒకటి. అలాగే ఆర్య 2 సినిమాలో 'గుప్పెడంత ఈ ప్రేమ' పాట వన్ సైడ్ లవర్స్ ఎప్పటికి మర్చిపోలేరు. సంతోషం సినిమాలో కూడా 'దేవుడే దిగివచ్చినా' అనే పాటతో కూడా అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తరుణ్ నటించిన నువ్వే నువ్వే సినిమాలోని 'ఆయామ్ వెరీ సారీ' అనే పాట కూడా అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది.

ఎమోషనల్ సాంగ్స్
ఇక భావోద్వేగమైన ప్రేమ పాటలు పాడడంలో కూడా కేకే టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 7/G బృందావన కాలనీ సినిమా లో ప్రియురాలు చనిపోతే ప్రేమికుడు ఎంతగా మనో వేదన చెందుతాడో ఆ పాట రూపంలో గుండెలకు హత్తుకొనేలా చెప్పాడు. తలచి తలచి చూస్తే సాంగ్ అప్పట్లో బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే సిద్దార్థ్ ఓయ్ సినిమాలో కూడా 'వెయిటింగ్ ఫర్ యూ' అనే పాట కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ఉదయ్ కిరణ్ సినిమాలో..
ఇక ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమాలోని 'ఎవ్వరినెప్పుడు' అనే పాట కూడా మరిచి పోలేనిది అనే చెప్పాలి. ఒకవైపు ఎమోషనల్ లవ్ సాంగ్స్ పాడుతూనే మరొకవైపు రొమాంటిక్ పాటలను కూడా అద్భుతంగా పాడేవాడు. అతడు సినిమాలోని అవును నిజం అనే పాట కూడా ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ కొట్టదు.


Click it and Unblock the Notifications











