Halloween వేడుకల్లో అపశృతి.. ప్రముఖ సింగర్ కన్నుమూత.. విషాదంలో మ్యూజిక్ ఇండస్ట్రీ!
దక్షిణ కొరియాతోపాటు సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నటుడు, గాయకుడు లీ జీ హ్యాన్ ఇటీవల దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కన్నుమూశారు. లీ జీ హాన్ వయసు 24 సంవత్సరాలు. ఆయన మరణ వార్తను సినీ ప్రముఖులు, సన్నిహితులు ధృవీకరించారు. లీ జీ హ్యాన్ మృతికి పలువురు శోకతప్త హృదయంతో సంతాపం తెలియజేస్తున్నారు. లీ జీ హ్యాన్ మరణ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సియోల్‌కు సమీపంలోని ఐటేవన్‌లో
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సమీపంలోని ఐటేవన్‌లో వారాంతంలో భారీగా హాలోవీన్ వేడుకులు జరిగాయి. ఈ వేడుకలకు భారీగా జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో లీజీ హాన్‌తోపాటు 154 మంది మృతి చెందారు. ఇరుకుగా ఉండే సందులో జరిగిన హాలోవీన్ వేడుకులు అత్యంత విషాదంగా మారాయి. ఓ దశలో కిక్కిరిసిన జనం భయాందోళనలకు గురికావడంతో జనం పరుగులు పెట్టారు. దాంతో జరిగిన తొక్కిసలాట అత్యంత విషాదానికి వేదికగా మారింది.

దేశవ్యాప్తంగా సంతాప దినాలు
దక్షిణ కొరియాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన విషాదానికి కొరియా ప్రభుత్వం శ్రద్దాంజలి ఘటించింది. జాతీయ స్థాయిలో నవంబర్ 5 తేది వరకు సంతాప దినాలను పాటిస్తున్నది. దేశంలో ఇప్పటికే జరుప తలపెట్టిన కే పాప్ మ్యూజిక్ వేడుకలను రద్దు చేస్తూ కొరియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లీ జీ హాన్ మరణంపై శ్రద్దాంజలి ఘటిస్తూ.. సంతాపం ప్రకటనను విడుదల చేసింది.

అక్టోబర్ 29వ రాత్రి
లీ జీ హాన్ మరణవార్తను ధృవీకరిస్తూ పలువురు నటులు, సంగీతకారులు శద్దాంజలి ఘటించారు. అక్టోబర్ 29వ రాత్రి జరిగిన తొక్కిసలాటలో లీ జీ హాన్ మరణించారు. ఈ వార్త అసత్యమైతే బాగుంటుందనే ఆవేదన కలుగుతున్నది. లీ జీ హాన్ లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ వార్తతో మేమంతా షాక్‌లో ఉండిపోయాం అని తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.

ప్రైవసీకి భంగం కలిగించొద్దు
లీ జీ హాన్ మృతి నేపథ్యంలో వారి కుటుంబానికి మనశాంతి చేకూరేలా వ్యవహరించాలని అభిమానులకు సినీ ప్రముఖులు కోరారు. ఆయన కుటుంబ తీవ్రమైన విషాదంలో ఉంవది. కాబట్టి వారి మనోభావాలను దెబ్బ తీయకుండా, వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. లీ జీ హ్యాన్ ఆత్మకు శాంతి కలిగేలా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. ఆయన అంత్యక్రియలు నవంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

లీ జీ హాన్ కెరీర్ గురించి
లీ జీ హాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఎంనెట్స్ ప్రొడ్యూస్ 101 సీజన్ 2తో విశేషమైన పాపులారిటిని సంపాదించుకొన్నారు. ఓవర్ డోస్ అనే షోలో పాల్గొనడంతోపాటు 5వ రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత టు డే వాజ్ అనదర్ నామ్ హ్యున్ డే అనే చిత్రం ద్వారా 2019లో నటుడిగా మారారు. ఆయన మరణించే సమయానికి ఆయన వయసు 24 సంవత్సరాలే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











