కర్ణాటక పబ్లిక్ బస్సులపై సింగర్ మంగ్లీ ఫొటోలు.. ఆ విధంగా ఉండడంతో దండం పెడుతూ..

ఈ ప్రపంచంలో మనిషిని కదిలించే విషయాల్లో అతి ముఖ్యమైనది సంగీతం. సంగీతం అంటే నచ్చని వారి ఉండరు. ఇక ఆ సంగీతంతో ఆకట్టుకునే గాయని గాయకులను కూడా అమితంగా ఆరాధించేవారు ఉంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్న వారిలో మంగ్లీ ఒకరు. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.

యంకర్ గా మొదలైన కెరీర్

యంకర్ గా మొదలైన కెరీర్

సింగర్ మంగ్లీ అంటే తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. మొదట ఇండస్ట్రీలో ఒక న్యూస్ యాంకర్ గా మొదలైన ఆమె ప్రయాణం ఎక్కువగా తీన్మార్ వార్తలతో సాధారణ పల్లెల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. తీన్మార్ సత్తితో చేసిన ఆమె అల్లరి వీడియోలు అప్పట్లో చాలానే ట్రెండ్ అయ్యాయి.

యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్

యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్

కేవలం టీవీ యాక్టర్ గానే కాకుండా తన స్థాయిని పాటలతో కూడా మరింత పెంచుకుంది. మొదట జానపద పాటలతో యూ ట్యూబ్ వీక్షకులను అమితంగా ఎట్రాక్ట్ చేసింది. మాస్ సాంగ్స్ , డేవోషనల్ సాంగ్స్ ఇలా అన్ని రకాల వెరీయేషన్స్ ను టచ్ చేసిన మంగ్లీ యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది.

 మొదటి సినిమా అవకాశం

మొదటి సినిమా అవకాశం

ఇక ఆమె సినిమాల్లో కూడా అవకాశాలు అందుకొని బిజీ సింగర్ గా మారిపోయింది. మొదట శ్రీ విష్ణు 'నీది నాది ఒకే కథ' సినిమాలో మొదటి సాంగ్ పాడిన మంగ్లీకి మంచి గుర్తింపు దక్కింది. ఆ తరువాత థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోనే శైలజా రెడ్డి అల్లుడి టైటిల్ సాంగ్ పాడి తన స్థాయిని మరింత పెంచుకుంది.

థమన్ సినిమాల్లో

థమన్ సినిమాల్లో

ఇక థమన్ తదుపరి సినిమాల్లో కూడా పాటలు పాడిన ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టయి. రాములో రాములా.. క్రాక్ భూమ్ బద్ధల్.. పాటలు కూడా బాగానే క్లిక్కయ్యాయి. అయితే రీసెంట్ గా కన్నడలో రాబర్ట్ అనే సినిమాలో కూడా 'కన్నె అదిరింది' పాటతో అక్కడ జనాలను కూడా ఎట్రాక్ట్ చేసింది.

కన్నడ ఆడియెన్స్ ఫిదా..

కన్నడ ఆడియెన్స్ ఫిదా..

సాధారణంగా కన్నడ జనాలకు ఒక పాట నచ్చితే అంత ఈజీగా ఆ సింగర్స్ ను వదలరు. వారిని అమితంగా ఇష్టపడతారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి తెలుగు గాయకుడిని దైవంలా భావించిన సంగీత ప్రియులు వారు. ఇక ఈ మధ్య పాడిన సారంగదరియా పాట కన్నడ ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది.

Recommended Video

Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
ఈ జీవితానికి ఇంకేం కావాలి?..

ఈ జీవితానికి ఇంకేం కావాలి?..

సింగర్ మంగ్లీకి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఎవరు ఊహించని విదంగా ఒక బస్సుపై మంగ్లీ ఫొటోలు వేయడంతో వారి అభిమానానికి మంగ్లీ షాక్ అయ్యింది. ఈ జీవితానికి ఇంకేం కావాలి?.. సదా మీ ప్రేమను కోరుకునే మీ మంగ్లీ.. అంటూ దండం పెడుతూ ఒక పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X