Singer Mangli: సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!
తనదైన గాత్రంతో అటు సినిమాల్లోనూ, ఇటు ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ అదిరిపోయే పాటలతో అలరిస్తూ ముందుకు సాగిపోతోన్న సింగర్ మంగ్లీ. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న ఈమె.. ఇటీవలి కాలంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
సింగర్ మంగ్లీ ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరైంది. అక్కడ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె నురుగా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా ఈవెంట్ ముగిసిన తర్వాత అంటే అర్ధరాత్రి సమయంలో మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ బయలుదేరింది. బెంగళూర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తోన్న సమయంలో శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద మంగ్లీ కారుకు ప్రమాదం జరిగింది.

మంగ్లీ ప్రయాణిస్తోన్న కారును ఓ డీసీఎం వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెతో పాటు కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఆ తర్వాత స్థానికుల సహాయంతో క్షతగాత్రులు నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. వాళ్లు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమిక విచారణ తెలిందని సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ప్రమాదంలో మంగ్లీ చిన్న చిన్న గాయాలతో సురక్షితంగానే బయటపడింది.
మరోవైపు, సింగర్‌గా మంగ్లీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'సూపర్ సింగర్' తాజా సీజన్‌కు మెంటర్‌గానూ వ్యవహరించింది. ఇది ఈ ఆదివారం జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో ముగిసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











