వివాదంలో సింగర్ మంగ్లీ.. గుడిలో సింగర్స్ కు ఉన్న న్యాయం సాధారణ జనాలకు లేదా?

తెలంగాణ గాయనిగా ఇప్పుడు భారీ స్థాయిలో గుర్తింపును అందుకుంటున్న అతి కొద్ది మంది సింగర్స్ లలో మంగ్లీ ఒకరు. మొదట్లో ఒక న్యూస్ ఛానల్స్ లో యాక్టింగ్ చేస్తూ కనిపించిన మంగ్లీ ఆ తర్వాత మెల్లగా తన పాటలతో గుర్తింపును అందుకుంటూ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తో జనాలను మరింతగా కట్టుకున్న మంగ్లీ అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. ఇక రీసెంట్గా ఆమె విడుదల చేసిన ఒక సాంగ్ షూట్ పై కూడా వివాదం మొదలైంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఎలాంటి పాట పాడిన కూడా..

ఎలాంటి పాట పాడిన కూడా..

సింగర్ మంగ్లీ ఎలాంటి పాట పాడిన కూడా ఈ రోజుల్లో అయితే యూట్యూబ్లో మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇప్పుడు ఆమె రెగ్యులర్ సింగర్ గా మారుతొంది. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా మంగ్లీ తానేంటో నిరూపించుకుంటుంది. అలాగే స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా ఆమె నుంచి వస్తూ ఉన్న ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా హైలెట్ అవుతున్నాయి.

శివరాత్రి స్పెషల్ సాంగ్స్

శివరాత్రి స్పెషల్ సాంగ్స్

ఇక ప్రతి శివ రాత్రికి కూడా సింగర్ మంగ్లీ నుంచి ఏదో ఒక పాట రావడం ఆనవాయితీ గానే వస్తోంది. ఆమె మొదటి నుంచి శివుడి పై పాటలు పడిన పాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు కూడా ఆమె ఒక స్పెషల్ వీడియోను షూట్ చేసి మరి రిలీజ్ చేస్తుంది. వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు కూడా ఆమె మరో పాటను రిలీజ్ చేసి మంచి గుర్తింపును అందుకుంది.

భంభం బోలే అంటూ..

భంభం బోలే అంటూ..

సింగర్ మంగ్లీ ఈసారి భంభం బోలే అంటూ శివుడి పై సరికొత్త పాటతో భక్తిని చూపించింది. ఈ పాటను ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ రచించారు. ఇక పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ పాటను శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో షూట్ చేశారు. ఆలయంలోని ప్రముఖ స్థావరాలను కూడా ఈ సాంగ్ లో హైలైట్ చేయడం విశేషం.

షూటింగ్ లకు అనుమతులు లేవు

షూటింగ్ లకు అనుమతులు లేవు

అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పాటపై ఓ వర్గం భక్తుల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ఎందుకంటే శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో ఎలాంటి షూటింగ్ లకు కూడా అనుమతులు లేవు. భక్తులు ఫోన్లు కూడా ఎక్కడికి తీసుకురాకూడదు అని అక్కడ అధికారులు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. చిన్న ఫోటో తీసిన కూడా ఎవరు అక్కడ ఊరుకోరు.

రెండు దశాబ్దాల నుంచి ఆంక్షలు

రెండు దశాబ్దాల నుంచి ఆంక్షలు

అయితే అంత కఠినమైన ఆంక్షలు విధించినచోట సాధారణ జనాలకు అసలు అనుమతి లేని చోట మంగ్లీకి ఎలా షూట్ చేసుకోవడానికి అనుమతులు ఇస్తారు అంటూ ఓ వర్గం వారు సోషల్ మీడియాలో ఈ విషయంపై మండిపడుతున్నారు. దక్షిణా కైలాసంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ ఆలయం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా రెండు దశాబ్దాల నుంచి వీడియో షూట్లకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. కానీ శివరాత్రి రోజు కోసం ప్రత్యేకంగా మంగ్లీ పాడిన శివుడి పాటను అందులోనే చిత్రీకరించారు.

 నిలదీస్తున్న స్థానికులు

నిలదీస్తున్న స్థానికులు

రాహు కేతు మండపం, అలాగే రాయల మండపం, ఉంజాల్ సేవా మండపంలో మంగ్లీ ఆటపాటను సాగించింది. ప్రధాన ఆలయంలో కూడా మంగ్లీ ఆటపాటలు వీడియోలో కనిపిస్తున్నాయి. అసలు సాధారణ జనాలకు కఠిన ఆంక్షలు విధించే అధికారులు ఇప్పుడు సింగర్ మంగ్లీ కి ఏ విధంగా అలాంటి అనుమతులు ఇచ్చారు అంటూ స్థానికులు సైతం నిలదీస్తున్నారు. మరి ఈ విషయంలో సింగర్ మంగ్లీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X