ఐటెమ్ నంబర్‌తో అదరగొట్టిన సింగర్ మంగ్లీ.. టిప్పా టిప్ప టిప్పర్ లారీ అంటూ
తెలుగు సంగీత ప్రపంచంలో ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తున్న పేరు సింగర్ మంగ్లీ. ఈ మధ్య కాలంలో ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులనే కాకుండా.. యువతకు కిక్కించేలా ఉంటున్నాయి. అంతేకాకుండా బలగం లాంటి సినిమాల్లో పాడిన పాటలు ఆబాలగోపాలాన్ని ఆలరించాయి. పాటలతో జోష్ పుట్టిస్తున్న మంగ్లీ తాజాగా మరో చార్ట్ బస్టర్ పాటను ఆలపించగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పాట వివరాల్లోకి వెళితే..

సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్‌రామన్, అమిత్ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం అంతిమ తీర్పు. ఏ అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డీ రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే అనే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ మాస్ పాటకు కోటి సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యానికి సింగర్ మంగ్లీ ఆలపించారు. మంచి జోష్‌తో సాగే ఐటెమ్ నంబర్ సాంగ్‌లో అమిత్‌తివారీ, స్నేహా గుప్తా ఆడిపాడారు. ఈ పాటకు ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫి అందించారు.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. టిప్పా టిప్పా సాంగ్ చక్కని డాన్స్ నంబర్. ఈ పాటను డాగ్ హౌస్‌లో నాలుగు రోజులపాటు చిత్రీకరించాం. టీ సిరీస్ ద్వారా విడుదల చేశాం. మంగ్లీ హస్కీ వాయిస్‌తో పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇదే ఉత్సాహంతో త్వరలో సెకెండ్ లిరికల్ సాంగ్, టీజర్‌ను విడుదల చేస్తాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.

నటీనటులు: సాయి ధన్సిక, విమలారామన్, గణేష్ వెంకట్‌రామన్, అమిత్ తివారీ, దీపు, సత్య ప్రకాశ్, నాగ మహేశ్ తదితరులు
కెమెరా: ఎస్.సుధాకర్ రెడ్డి
సంగీతం: కోటి
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, దేవరాజ్
కొరియోగ్రఫి: ఈశ్వర్ పెంటి
ఛీప్ కో డైరెక్టర్: బండి రమేష్
పీఆర్వో: మధు విఆర్


Click it and Unblock the Notifications











