10 ఏళ్లలో అలాంటి దారుణం.. నా మర్మాంగంలో అలా అంటూ.. షాకింగ్‌గా స్వింగ్ జర సింగర్ వెల్లడి

బాలీవుడ్ గాయని నేహా భాసిన్ తనపై లైంగిక దాడులు జరిగాయంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. నా జీవితంలో అనేక సార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించడం బాలీవుడ్‌ను కుదిపేసింది. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడిస్తూ ఇంటర్వ్యూలో పలు విషయాలను బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే..

నా బాల్యంలో దుర్బర పరిస్థితులు

నా బాల్యంలో దుర్బర పరిస్థితులు

నా బాల్యంలో ఎన్నోసార్లు దుర్భర పరిస్థితులను చవిచూశాను. నాకు పదేళ్లు ఉన్న సమయంలోనే నేను హరిద్వార్‌ సందర్శనకు వెళ్లాను. ఆ సమయంలో నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. దేవాలయంలో ఉంటే ఓ అబ్బాయి వచ్చి తన వేలిని నా మర్మాంగంలో గుచ్చాడు. దాంతో నేను షాక్‌కు గురయ్యాను. దాంతో అక్కడి నుంచి పారిపోయాను అని నేహా భాసిన్ తెలిపారు.

హారిద్వార్ ఆలయంలో అలా

హారిద్వార్ ఆలయంలో అలా

హరిద్వార్ సంఘటన తర్వాత కొద్ది సంవత్సరాలకు మరోసారి అలాంటి సంఘటనే ఎదురైంది. ఓ వ్యక్తి వచ్చి నా బ్రెస్ట్‌ను గట్టిగా పట్టుకొన్నాడు. ఇలాంటి సంఘటనలతో నేను చాలా బెదిరిపోయాను. నా తప్పులేకుండా నా జీవితంలో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను అని నేహా భాసిన్ తెలిపారు.

నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ

నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో కొందరు నన్ను మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా, మతపరంగా వేధిస్తున్నారు. దీనిని ముఖం చూపించలేని కొందరు వ్యక్తులు చేసే ఉగ్రవాదం అనిపిస్తున్నది. ఇలాంటి ఉగ్రవాదాన్ని నేను ఖండిస్తున్నాను. త్వరలోనే ఈ వేధింపులను సైబర్ పోలీసుల దృష్టికి తీసుకు వస్తాను అని నేహా భాసిన్ పేర్కొన్నారు.

 ఓ గాయనికి సపోర్ట్ చేస్తే..

ఓ గాయనికి సపోర్ట్ చేస్తే..

సోషల్ మీడియాలో నాకు ఇటీవల బెదిరింపులు, చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. నేను ఓ గాయనికి జరిగిన అన్యాయంపై నా వాదన వినిపించాను. అయితే కే పాప్ బ్యాండ్ నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొన్నది. అప్పటి నుంచి రకరకాలుగా బెదిరిస్తున్నారు. అయితే నేను చేతుల ముడుచుకొని కూర్చొను. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకొంటున్నాను అని నేహా భాసిన్ పేర్కొన్నారు.

Recommended Video

90ml Director Shekar Reddy Exclusive Interview
టాలీవుడ్‌లో నేహా భాసిన్ కెరీర్

టాలీవుడ్‌లో నేహా భాసిన్ కెరీర్

బాలీవుడ్ టాప్ సింగర్‌గా పేరు తెచ్చుకొన్న నేహా భాసిన్ విషయానికి వస్తే. భిల్లా చిత్రం ద్వారా తమిళ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కరెంట్ సినిమాలో అటు నువ్వే.. ఇటు నువ్వే పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దడ చిత్రంలో హల్లో హల్లో, ఊసరవెళ్లిలో నిహారిక నిహారిక పాట, నువ్వా నేనా చిత్రంలో థ థ తమారా అనే గేయాన్ని,1 నేనొక్కడినే చిత్రంలో ఆవ్ తుజో మోగ్ కార్టా పాటను పడారు. అంతేకాకుండా జనత గ్యారేజ్ చిత్రంలో యాపిల్ బ్యూటి, జై లవకుశలో స్వింగ్ జరా పాటను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X