పడకగదిలోకి వస్తే ఆఫర్... డైరెక్టర్‌ను చెప్పుతో కొడుతానని గాయని వార్నింగ్

Recommended Video

'Will Slap You With Slipper” Popular Singer Warns Director || Filmibeat Telugu

మీటూ ఉద్యమం ఊపందుకొన్న తర్వాత సినీ తారలకు సంబంధించిన వేధింపుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎన్ని రకాలుగా వేధింపులు జరిగిన కెరీర్ కోసం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఏదైనా జరగకూడదని జరిగితే సోషల్ మీడియాలో జరిగిన అన్యాయాన్ని ప్రేక్షకులు, సమాజం దృష్టికి తీసుకొస్తున్నారు. దాంతో సినీ పరిశ్రమలో వేధింపుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. తాజాగా ఓ డైరెక్టర్‌తో తనకు జరిగిన అన్యాయాన్ని గాయని ప్రణవి ఆచార్య వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

ఆఫర్ కోసం డైరెక్టర్ వద్దకు వెళితే

ఆఫర్ కోసం డైరెక్టర్ వద్దకు వెళితే

చిన్నతనం నుంచి నాకు గాయని కావాలనే కోరిక ఉండేది. నేను ఇంటర్మీడియెట్ చదువుతుండగా సినిమాలో పాట పాడే అవకాశం లభించింది. ఓ డైరెక్టర్ నాకు కబురు పెట్టగా అతడి వద్దకు వెళ్లాను. ఆయన నాతో ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నట్టు అర్థమైంది. వెంటనే నేను జాగ్రత్త పడేందుకు సిద్ధమయ్యాను. స్వతహాగా నేను ధైర్యవంతురాలిని కావడంతో అంతగా భయపడలేదు అని ప్రణవి చెప్పారు.

పడకగదిలోకి వస్తే ఆఫర్

పడకగదిలోకి వస్తే ఆఫర్

ఆ డైరెక్టర్ తన మనసులో ఉండే అసలు విషయాలను బయటపెట్టడం మొదలుపెట్టారు. నీకు నేను ఆఫర్ ఇస్తాను. కానీ పడకగదిలోకి వస్తావా అని అడిగారు. దాంతో నా దిమ్మతిరిగింది. నేను చిన్నపిల్లను. ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. నాలాంటి అమ్మాయితో అలా ప్రవర్తించడం సరికాదని చెప్పాను. ఇక ఆఫర్ రాదని కన్ఫర్మ్ చేసుకొన్నాను అని ప్రణవి వెల్లడించారు.

చెప్పుతో కొడుతాను

చెప్పుతో కొడుతాను

ఇక ఎలాగైనా డైరెక్టర్‌కు బుద్ధి చెప్పాలని భావించాను. ఆయనకు ఎదురు చెప్పడం మొదలుపెట్టాను. ఇక తాను నాపై ఏదో కామెంట్లు చేయబోగా.. మరో మాట ఎక్కువగా మాట్లాడితే చెప్పుతో కొడుతాను అని హెచ్చరించాను. దాంతో ఆ డైరెక్టర్ కంగు తిన్నాడు. అప్పటి నుంచి నేను చాలా కఠినంగా ఉండటం మొదలుపెట్టాను. అవకాశాల కోసం తిరిగే సమయంలో చాలా కంట్రోల్‌లో ఉండేదానిని అని ఇటీవల ఓ మీడియాకు వెల్లడించారు.

 అప్పటి నుంచి ఇప్పటి వరకు

అప్పటి నుంచి ఇప్పటి వరకు

అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. నా గురించి తెలిసిన వాళ్లు అలా నోరు జారరు. నాతో చెడుగా ప్రవర్తించే ఆస్కారమే ఉండదు. నేనే కాదు.. నా ఫ్యామిలీ కూడా ఇలాంటి విషయాలను సహించదు. అలాంటి గాయని ప్రణవి ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగర్‌గా పేరు సంపాదించుకోవడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X