‘సింగర్ సునీత అలాంటి టార్చర్ పెట్టింది.. మిమ్మల్ని చూస్తే అసహ్యమంటూ కీరవాణి’
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో పాడుతా తీయగా. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి పాపులారిటీని కల్పించడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. అయితే ఆయన మరణాంతరం ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. అంతేకాకుండా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. తాజా యువ సింగర్ ప్రసస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. అయితే ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..
తాజాగా ప్రవస్తీ విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే అవమానాలు, వివక్ష గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వీడియో పెట్టాను. మొన్న జరిగిన జరిగిన ఎపిసోడ్‌లో నన్ను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసిన తర్వాత చెబుతున్నానని అనుకొంటారు. కానీ ఎలిమినేట్ చేసిన వచ్చిన ధైర్యంగా మాట్లాడుతున్నాను.

ఇతరులు పాడేటప్పుడు శృతిలో పాడకపోయినా సలహాలు ఇచ్చేవారు..సైగలు చేసే వారు. చంద్రబోస్ గారు నన్ను మెచ్చుకొన్నారు. కానీ ఓ సందర్భంలో నా తప్పు లేకపోయినా నన్ను తప్పుపట్టారు. ఇతరులు తప్పు చేసిన వదిలేశారు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చారు. నా కుటుంబ పరిస్థితి కారణంగా వెడ్డింగ్ సాంగ్స్ చేశాను. అయితే వెడ్డింగ్ సాంగ్స్ చేసే వాళ్లు సింగర్స్ కాదు. అలాంటి వాళ్లను చూస్తే అసహ్యం అంటూ కిరవాణి అన్నారు. అంతా పెద్ద స్థాయిలో ఉండి ఇలా మాట్లాడుతారా? అని ప్రవస్తి ఆరాధ్య అన్నారు.
పాడుతా తీయగా రియాలిటీ సో ఓ గౌరవప్రదమైన షో. అది ఎస్పీ బాలు గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. చాలా ప్రశాంతంగా సాగేది. అయితే ఇటీవల దానిని మళ్లీ ప్రారంభించారు. దానికి ఆడిషన్స్ పెట్టారు. కానీ నా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆడిషన్స్‌కు వెళ్లలేకపోయాను. కానీ నిర్వాహకులు నన్ను పిలిచి.. షోలో పాల్గొనేలా చేశారు. ఈ సీజన్‌కు వెళితే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని ప్రవస్తి ఆరాధ్య అన్నారు.
పాడుతా తీయగా షోలో జడ్జీలు చాలా పక్షపాతం చూపించే వారు. తమకు నచ్చిన వారు ఉంటే.. వారిని ప్రోత్సాహించి ఎక్కువ మార్కులు వేసే వారు. సాంగ్స్ సెలక్షన్‌లో కూడా వివక్ష చూపించే వారు. సాధారణంగా 6 పాటలు ఇస్తాం. కానీ వారు ఆమోదించకపోయేవారు. ఇంకా ఇవ్వమని అడిగే వారు. అదీ కాకుండా మగ గొంతుతో ఉండే పాటలు ఇచ్చి పాడమనే వారు. అయినా పాడి చూపించాను అని ఆమె అన్నారు.
కొందరు షూట్‌కు రాకపోయినా వారి కోసం షెడ్యూల్ మార్చివేసే వారు. ఇంకా వాళ్లను ఒకలాగా, నన్ను ఒకలాగా చూసే వారు. వాళ్లు లేటుగా వచ్చిన ఏమనే వారు కాదు. మేము కాస్త ఆలస్యంగా వస్తే.. వేధించే వారు. అలాగే డిన్నర్ టైమ్‌లో భోజనం పెట్టే వారు కాదు. సరిగా సౌకర్యాలు ఉండేవి కావు. లేటైనా ఎలాంటి వసతులు ఉండేవి కావు అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసే వారు.
రియాలీటీ షో షూట్ సందర్భంగా రకరకాల ఇబ్బందులు పెట్టారు అన్నారు. ప్రొడక్షన్ వాళ్లు బాడీ షేమింగ్ చేసే వారు. మీరు ఇలాగా ఉంటే అవుట్ ఫిట్స్ ఎలా ఇవ్వమంటారు. ముఖ్యంగా సింగర్ సునీత నన్ను బాగా వేధించారు. ఫేస్ మీదనే మాటలు అనేసి టార్చర్ చేసే వారు. దారుణంగా ట్రీట్ చేసేవారు. నేను స్టేజ్ మీదకు వస్తే.. ఓ రకంగా ఫేస్ పెట్టే వారు అని ప్రవస్తి వేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











