Rahul Sipligunj: బికినీ భామలతో మునిగి తేలుతున్న సింగర్ రాహుల్.. తెల్ల పాపల బ్యాక్ హైలెట్ చేస్తూ..

తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల కాలంలో మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. అతను ఎలాంటి పాట పాడిన కూడా యూట్యూబ్లో మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలలో కూడా పాటలు పాడేందుకు అతనికి ఎక్కువ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. అయితే రాహుల్ అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా రాహుల్ ఒక ఊహించిన విధంగా కనిపించాడు. బికినీ పాపాలతో అతను ఎంతో రొమాంటిక్ గా మునిగి తేలుతున్నట్లు అర్థమవుతుంది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

అందరిని ఆకట్టుకునేలా..

అందరిని ఆకట్టుకునేలా..

సింగర్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ మొదట కొన్ని మాస్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు. మాస్ లోనే తన స్టైల్ ను హైలెట్ చేస్తూ పాటలను యూట్యూబ్లో మరింత వైరల్ అయ్యేలా చేస్తుంటాడు. వీలైనంతవరకు మాస్ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా రాహుల్ పాటలు పాడే విధానం చాలా హైలైట్ అయ్యేవి. అంతేకాకుండా ఆ పాటలు చాలా నేచురల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉండేవి.

నాటు నాటు పాటతో..

నాటు నాటు పాటతో..

రాహుల్ సిప్లిగంజ్ స్పెషల్ మ్యూజిక్ వీడియోలను చూసిన తర్వాత అతనికి ఎంఎం కీరవాణి చాలా మంచి అవకాశాలు ఇచ్చాడు. ఇటీవల నాటు నాటు పాట కూడా ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమలో అతను అగ్ర సంగీత దర్శకుల నుంచి పిలుపు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా 2009లో జోష్ సినిమాలోని కాలేజీ బుల్లోడా అనే పాట ద్వారా అతనికి మంచి బ్రేక్ లభించింది. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయాడు.

 బిగ్ బాస్ ద్వారా

బిగ్ బాస్ ద్వారా

ఇక రాహుల్ సిప్లిగంజ్ 2019లో బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అందులో అతను విన్నర్ గా కూడా నిలిచాడు. అప్పట్లో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో ద్వారా అయితే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకున్నాడు.

స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ క్రేజ్

స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ క్రేజ్

ఇక అప్పుడప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కొంతమంది గ్లామర్ బ్యూటీలతో కూడా తన స్పెషల్ మ్యూజిక్ వీడియోలను రిలీజ్ చేస్తూ ఉంటాడు. ప్రతిపాటలో కూడా స్టైల్ తో పాటు మాస్ అలాగే గ్లామర్ డోస్ కూడా హైలైట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటాడు. ఇక 'ఏ పిల్ల', బేబీ అనే పాటలు ఇటీవల కాలంలో బాగా క్రేజ్ అందుకున్నాయి. అంతేకాకుండా పూర్ బాయ్ అంటూ గతంలో రాహుల్ రిలీజ్ చేసిన సాంగ్ కూడా బాగా వైరల్ అయింది.

బికినీ పాపలతో రాహుల్

ఇక రాహుల్ సిప్లిగంజ్ నుంచి త్వరలో మరో స్టైలిష్ గ్లామరస్ మ్యూజిక్ వీడియో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దుబాయ్ లో ప్రత్యేకంగా షూట్ చేస్తున్న ఆ పాట యొక్క లొకేషన్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో రాహుల్ విదేశీ భామలతో మునిగితేలుతున్నాడు. వారు బికినీలో కనిపిస్తూ ఉండగా పక్కనే రాహుల్ ఎంతో చలాకీగా కనిపిస్తూ ఉన్నాడు.

దుబాయ్ అంటే మినిమం ఉంటది

దుబాయ్ అంటే మినిమం ఉంటది

దుబాయ్ అంటే మినిమం ఉంటది అని క్యాప్షన్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్ నీయనమ్మ అనే మ్యూజిక్ వీడియోను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా అది నాలుగు భాషల్లో రాబోతున్నట్లుగా కూడా రాహుల్ తెలియజేశాడు. ఈసారి రాహుల్ ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X