రెండో బిడ్డకు జన్మనిచ్చిన పాపులర్ సింగర్.. తనకంటే చిన్నవాడైనా మూడో భర్తతో సీక్రెట్‌గా.. RRR టీమ్‌లో అలా!

ప్రపంచ సంగీత ప్రియులకు సింగర్ రిహన్నా శుభవార్తను తెలియజేసింది. తన సహజీవన భాగస్వామి A$AP Rocky తో కలిసి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రాకీ, రిహాన్నాకు ఇది రెండో సంతానం కావడం గమనార్హం. ఇంతకు ముందు అంటే 15 నెలల క్రితం తొలి బిడ్డకు జన్మనిచ్చారు. ఇక రెండో బిడ్డ జననానికి సంబంధించిన వార్తను మీడియా వెల్లడించగా, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే. .

ఏడాది కంటే చిన్నవాడైన : సింగర్ రిహన్నా (35) తనకంటే ఏడాది చిన్నవాడైన A$AP Rocky (34)తో సహజీవనం కొనసాగిస్తున్నారు. కొద్ది నెలల క్రితం సూపర్ బౌల్ హాఫ్ టైమ్ షో సందర్భంగా తాము మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే వార్తను వెల్లడించడంతో వారి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Singer Rihanna blessed with Baby boy with A$AP Rocky secretly

గర్బవతిని అంటూ సోషల్ మీడియాలో : అనంతరం జూలై 2023 మాసంలో తాను గర్బవతిని అంటూ సోషల్ మీడియా ద్వారా వార్తను షేర్ చేసింది. బికినీలో తన గర్బాన్ని చూపుతూ ఫోటోషూట్ చేసింది. రెండోసారి మాతృత్వపు అనుభూతిని పొందబోతున్నాను అంటూ కామెంట్ చేసింది. రియానా తన మెసేజ్‌తోపాటు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Singer Rihanna blessed with Baby boy with A$AP Rocky secretly

సీక్రెట్‌గా రెండో బిడ్డకు జననం : మీడియా కథనాల ప్రకారం.. రిహన్నా ఆగస్టు మొదటి వారంలోనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే వార్తను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియా గానీ, వారి పీఆర్ టీమ్ నుంచి గానీ వార్త బయటకు రాకుండా జాగ్రత్త వహించారు. అయితే రిహన్నా రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చింది అని మీడియా వెల్లడించింది.

Singer Rihanna blessed with Baby boy with A$AP Rocky secretly

రిహన్నా పెళ్లిళ్లు, బ్రేకప్ గురించి : ఇక రిహన్నా దాంపత్య జీవితం విషయానికి వస్తే.. క్రిస్ బ్రౌన్ అనే ప్రముఖుడితో తొలుత 2007 నుంచి 2009 వరకు సహజీవనం సాగించింది. ఆ తర్వాత వారిద్దరి బ్రేకప్ చెప్పుకొని.. 2012 నుంచి 2013 వరకు మళ్లీ సహజీవనం చేశారు. ఆ తర్వాత హాసన్ జమీల్ అనే ప్రముఖుడితో 2017 నుంచి 2020 వరకు సహజీవనం చేసింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం 2020 నుంచి Asap రాకీతో సహజీవనం చేస్తున్నది. వీరిద్దరికి ఇద్దరు సంతానం కలిగారు.

Singer Rihanna blessed with Baby boy with A$AP Rocky secretly

రిహన్నా మ్యూజిక్ కెరీర్ : రిహన్నా వ్యక్తిగత జీవితం వివరాల్లోకి వెళితే.. బార్బడోస్‌కు చెందిన గాయనిగా సుపరితులు. గేయ రచయితగా, మహిళా వ్యాపారవేత్తగా, నటిగా మంచి గుర్తింపు పొందారు. డెఫ్ జామ్‌తో కలిసి పాట పాడిన తర్వాత సంగీత సామ్రాజ్యంలో భారీ పాపులారిటీ తెచ్చుకొన్నది. మ్యూజిక్ ఆఫ్ సన్, ఏ గర్ల్ లైక్ మీ, కరిబియన్ మ్యూజిక్ లాంటి ఆల్బమ్స్ మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నాయి. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో RRR మూవీ టీమ్‌తో కలిసి సందడి చేసింది. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X