‘అతడి వల్లే పాడటం మానేశా.. ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యా’
ఎన్నో పాటలు పాడి తెలుగు ఆడియన్స్ మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సింగర్ సాహితీ పర్సనల్ లైఫ్ కారణంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సింగింగ్ కు దూరం కావలసి వచ్చింది. అయితే తనకు ఇష్టమైన ప్రొఫెషన్ కు దూరం కావడానికి కారణం ఎవరో తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టింది సాహితీ. తన ప్రొఫెషనల్ లైఫ్ ను ఈ సింగర్ ఎవరి కోసం త్యాగం చేసింది అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
సింగర్ సాహితీ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. తనకు చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని కోరిక ఉండేదని, ముందుగా తిరుపతి గోపాల కృష్ణ అనే వయోలనిస్ట్ దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టానని గుర్తు చేసుకుంది సాహితీ.

ఆ తర్వాత ఓ కాంపిటీషన్లో తను పాట పాడడం చూసిన తన అంకుల్, సింగర్ జోగారావు పాటకు మాడ్యుయేషన్ ఎలా ఉండాలి, బ్రీత్ కంట్రోల్ ఎలా చేయాలి అనే ముఖ్యమైన టిప్స్ చెప్పారని వెల్లడించింది. ఆ తర్వాత డిస్ట్రిక్ లెవెల్ లో జరిగిన ఓ కాంపిటీషన్లో రామాచారి జడ్జ్ గా వ్యవహరించగా సింగర్ ధనుంజయకు ఫస్ట్ ప్రైజ్, తనకు సెకండ్ ప్రైజ్ వచ్చిందనే విషయాన్ని ఇంటర్వ్యూలో బయట పెట్టింది సాహితీ.
ఇక ఆ తర్వాత ఈ టీవీలో వచ్చిన సై సింగర్స్ ఛాలెంజ్ లో ఫైనల్స్ వరకు వచ్చినప్పటికీ త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఫైనల్స్ లో పాల్గొనలేకయానని, చివరి నిమిషంలో ఎలిమినేట్ అయ్యానని, ఆ తర్వాత జీ తెలుగు సరిగమపలో మాత్రం విన్ అయ్యానని సాహితీ చెప్పుకొచ్చారు.
అలా మొదలైన ఆ జర్నీ ముందుగా ఒడిదుడుకులతో సాగిందని, అనంతరం అంచెలంచెలుగా ఎదిగిందని వెల్లడించింది ఒకప్పటి ఈ స్టార్ సింగర్. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కనిపించకుండా పోవడం గురించి స్పందిస్తూ దాదాపు 47 సినిమాల్లో పాటలు పాడిన తర్వాత తనకు పెళ్లి అయిపోయింది అని, పెళ్లయ్యాకే పాటలకు దూరమయ్యానని అసలు విషయంపై క్లారిటీ ఇచ్చింది.
తన ఫ్యామిలీ మెంబర్ నే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నానని తెలిపిన సాహితీ ఆయన బిజినెస్ మ్యాన్ కావడంతో ఎంతో మంది ఆయనపై ఆధారపడి ఉంటారని వెల్లడించింది. అందుకే భర్త కోసం తాను తన ప్రొఫెషనల్ లైఫ్ ను త్యాగం చేసి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యానని, అదే క్రమంలో సింగింగ్ కు దూరమై, చాలా మిస్ అయ్యానని సాహితీ గుర్తు చేసుకుంది.
ఇక ఆ తర్వాత పాప పుట్టాక హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యామని, అదొక మైండ్ ట్రాన్సిషన్ అంటూ తన సింగింగ్ కెరీర్ లో గ్యాప్ రావడానికి కారణం ఏంటో వివరించింది ఈ సూపర్ సింగర్. మొత్తానికి పర్సనల్ లైఫ్ కోసం కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ లైఫ్ ని పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసింది సింగర్ సాహితి. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ సింగర్ ఇలా తనకు సంబంధించిన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించిన విషయాలను చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











