Divorce టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌తో భార్య విడాకులు.. 11 ఏళ్ల దాంపత్యానికి గుడ్‌బై!
సినీ పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్, తన భార్య పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. గత కొద్దికాలంగా వారిద్దరూ విడిపోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినా.. వాటిని సినీ ప్రముఖులు కొట్టి పడేశారు. అయితే మే 13వ తేదీన మ్యూజిక్ డైరెక్టర్ భార్య అధికారికంగా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ విడాకులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ మేనల్లుడు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీ వెంకటేష్ కుమారుడైన జీవీ ప్రకాశ్ తన దాంపత్య జీవితానికి ముగింపు పలకనున్నారు. తన భార్య గాయని సైంధవితో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. వారి నిర్ణయం మ్యూజిక్ ఇండస్ట్రీనే కాకుండా సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది.

ఇక జీవి ప్రకాశ్, సైంధవి దాంపత్య జీవితం విషయానికి వస్తే.. బాల్యం నుంచే స్నేహితులు. వారిద్దరూ ఒకే స్కూల్‌లో క్లాస్ మేట్స్. వారిద్దరి మధ్య స్నేహం బలపడి ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ ఇరు కుటుంబాల అనుమతితో వివాహం చేసుకొన్నారు. వారిద్దరికి 4 ఏళ్ల కూతురు అన్వి సంతానంగా ఉంది.
అయితే జీవీ ప్రకాశ్, సైంధవీ వివాహం 2013లో జరిగింది. దాదాపు వారిద్దరి మధ్య 11 ఏళ్ల దాంపత్య జీవితం కొనసాగింది. ఇటీవల వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు చోటు చేసుకొన్నాయి. వారిద్దరూ పరిష్కరించుకోలేని విధంగా వైవాహిక జీవితంలో గ్యాప్ రావడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. వారిద్దరి కుటుంబాలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విడాకులు అనివార్యమయ్యాయి.

తమ దాంపత్య జీవితానికి ముగింపు పెడుతున్నట్టు గాయని సైంధవి.. అధికారికంగా సోషల్ మీడియాలో లేఖను రాశారు. జీవీ ప్రకాశ్, నేను మా 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకొన్నాం. మా మానసిక ప్రశాంత కోసం, మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఒకరి అభిప్రాయలను ఒకరం గౌరవించుకొంటూ విడాకులు తీసుకొంటున్నాం అని ఆమె తన లేఖలో పేర్కన్నారు.

మా జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని వేడుకొంటున్నాం. మేము వేర్వేరుగా జీవించాలనే నిర్ణయం మాకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం. మా పరిస్థితిని అర్ధం చేసుకొని ఇలాంటి క్లిష్ట సమయంలో సపోర్ట్ చేయాలని కోరుకొంటున్నాం అని సైంధవి అభ్యర్థించారు.


Click it and Unblock the Notifications











