మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్యూన్లు కాపీకొడతారా? అసలు విషయం వెల్లడించిన సింగర్..

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద చాలా కాలంగా ఓ అపవాదు ఉంది. ఆయన రీపీటెడ్‌ మ్యూజిక్ ఇస్తారు, కొట్టిన ట్యూన్సే మళ్లీ కొడతారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ విషయంపై తమన్‌కు సన్నిహితంగా ఉండే సింగర్ సాకేత్ స్పందించారు.

చాలా మందికి ఇండస్ట్రీలో జరిగే విషయాలు తెలియవు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఒక దర్శకుడికి ఎక్కడో ఏదో పాట బాగా నచ్చుతుంది. ఆ పాట తమ సినిమాలో సిచ్యువేషన్‌కు సూటవుతుందని, ఈ పాటనే కాస్త మార్చి పెట్టండి అని ఒత్తిడి చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అలా చేయక తప్పదు అని సాకేత్ తెలిపారు.

అందుకే అలా చేయాల్సి ఉంటుంది

అందుకే అలా చేయాల్సి ఉంటుంది

తమన్ కంపోజ్ చేసిన పిల్లా చావ్ అనే పాట స్పానిష్ పాట. దాన్ని కాపీ అన్నారు. ఆయన చాలా హిట్ సాంగ్స్ ఇచ్చారు. కొత్త ట్యూన్స్ ఇచ్చారు. కానీ కొన్ని సార్లు నిర్మాతలు, దర్శకులు, హీరోల అభిరుచి మేరకు అలా నడుచుకోవాల్సి ఉంటుందని సాకేత్ స్పష్టం చేశారు.

ఎన్ని కొత్త ట్యూన్లు ఇస్తారు?

ఎన్ని కొత్త ట్యూన్లు ఇస్తారు?

సంవత్సరానికి దాదాపు 100 సినిమాలు వస్తాయి. ఒక్కో సినిమాలో 5 పాటు ఉంటాయి. ఎవరైనా ఎంతకని కొత్తగా చేయగలరు. సబ్జెక్ట్ అవే ఉంటాయి. అయినప్పటికీ తమన్ గారు ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తున్నారు. ఇలాంటి కాపీ ఆరోపణలు తమన్ మీదనే కాదు.. చాలా మందిపై ఉంది. అయితే కొన్ని పాటల వల్ల తమన్ మీద ఈ ప్రచారం ఎక్కువ జరిగింది.

డైరెక్టర్ చెప్పింది ఇవ్వాల్సిందే

డైరెక్టర్ చెప్పింది ఇవ్వాల్సిందే

అరవింద సమేత, తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల్లో పాటలు చాలా కొత్తగా చేశారు. భాగమతికి డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కు స్క్రిప్ట్ చెప్పి వదిలేస్తే అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. మాకు ఇది కావాలంటే అదే చేయక తప్పదు. సినిమాకు డైరెక్టరే కెప్టెన్. ఆయనకు ఏం కావాలంటే అది ఇవ్వడమే మ్యూజిక్ డైరెక్టర్ పని. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్స్ అందరూ డైరెక్టర్ చెప్పింది ఇవ్వాల్సిందే అని సాకేత్ తెలిపారు.

దాన్ని కాపీ కొట్టడం అనొద్దు

దాన్ని కాపీ కొట్టడం అనొద్దు

తమన్ ఇతర భాషల నుంచి పాటలు కాపీ ఎప్పుడూ కొట్టలేదా? అంటే.... దాన్ని కాపీ కొట్టడం అనరు, డైరెక్టర్ రిక్వైర్మెంట్ కాబట్టి అలా ఇవ్వడం జరుగుతుంది. పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లే ఈ విషయం ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో వెల్లడించారని సాకేత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X