Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం.. గుణపాఠం నేర్చుకొన్నా.. క్షమాపణలు చెప్పినా..
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ చేసిన నిర్వాకంపై ఆమె పడింది. ఫ్లయిట్లో సంగీత వాయిద్య పరికరాన్ని తీసుకెళ్లడానికి అనుమతి లేదంటూ అధికారులు అభ్యంతరం చెప్పడంపై ఆమె సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.
సంగీతకారులు తమ వెంట వాయిద్యాలను తీసుకెళ్లడం సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు ఇష్టం లేదనుకొంటాను. వారి ఆలోచనలు స్పష్టంగా తెలిశాయి. వారి నుంచి ఓ గుణపాఠం నేర్చుకొన్నాను అని శ్రేయా ఘోషల్ ట్విట్టర్లో తెలిపారు. శ్రేయా ఘోషల్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతీ ఒక్కరు సింగపూర్ ఎయిర్ లైన్స్‌పై ధ్వజమెత్తారు.
శ్రేయా ఘోషల్ చేసిన ట్వీట్‌కు సింగపూర్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. శ్రేయా.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీకు కలిగిన ఇబ్బందిని, ఇతరులకు జరుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొన్నాం. మా సిబ్బంది ఈ విషయంలో జాగ్రత్త పడమని సూచించాం అని సింగపూర్ ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. అయినా సదరు ఎయిర్ లైన్స్‌పై ట్రోలింగ్‌కు ఇంకా తెరపడలేదు.
శ్రేయా ఘోషల్ గత 13 ఏళ్లుగా సినీ పరిశ్రమలో విశేషంగా రాణిస్తున్నది. అషికీ2, కళంక్, అగ్నిపత్, బాడీగార్డ్ లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలకు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది.