For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైరల్‌గా సిద్ శ్రీరామ్ సాంగ్.. తోలుబొమ్మలాటకే హైలెట్

  |

  డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'తోలుబొమ్మలాట'. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన 'మనసారా మనసారా' పాటు లిరికల్‌ వీడియోను ఇటీవల విడుదల చేశారు.

  ఈ సందర్భంగా సిద్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ''సురేష్‌ బొబ్బిలి స్వరకల్పనలో చైతన్యప్రసాద్‌ రాసిన 'మనసారా మనసారా' అనే మంచి పాటతో మళ్లీ మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన మెలోడీ, అందమైన సాహిత్యం ఉన్న ఈ పాట నాకు ఉద్వేగంతో కూడిన అనుభూతినిస్తుంది. మీరూ వినండి. మీకూ అదే అనుభవాన్నిస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు.

  Singer Sid Srirams song of Tolu bommalata goes viral

  దర్శకుడు విశ్వనాథ్‌ మాగంటి మాట్లాడుతూ ''ఈ చిత్రంతో మొత్తం 5 పాటలున్నాయి. అందరూ ఫేమస్‌ సింగర్స్ పాడారు. సిద్‌ శ్రీరామ్‌, విజయ్‌ ఏసుదాస్‌, చిన్మయి, అనురాగ్‌ కులకర్ణి, యాజిన్‌ నజీర్‌, సమీరా భరద్వాజ్‌, హేమచంద్ర ఈ పాటలు ఆలపించారు. ఈ పాటలన్నీ చైతన్య ప్రసాద్‌ రాశారు. 'నీదీ నాదీ ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి మంచి సినిమాలకు స్వరాలందించిన సురేష్‌ బొబ్బిలి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన 'మనసారా మనసారా' పాట సినిమాలో చాలా కీలకమైనది. ఈ పాట ఈ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. విశ్వంత్‌, హర్షితపై ఈ పాట చిత్రీకరించాం. విశ్వంత్‌, హర్షితకు ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇస్తుంది'' అని తెలిపారు.

  Singer Sid Srirams song of Tolu bommalata goes viral

  నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి మాట్లాడుతూ ''ఒక కుటుంబంలోని మూడు జనరేషన్ల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వీటన్నిటి కలబోత ఈ చిత్రం. ఒక చిన్న కుర్రాడు ఇంత ఇంటెన్సిటీ, డెప్త్ ఉన్న ఫ్యామిలీ ఎమోషనల్‌ స్టోరీని ఎలా డీల్‌ చేశాడా అని రేపు సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్‌ ఫీలవుతారు. నవంబర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.

  నటీనటులు:
  సంగీత, కల్పన, శిరీష సౌగంద్‌, ధన్‌రాజ్‌, పూజా రామచంద్రన్‌, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, 'తాగుబోతు' రమేష్‌, 'బస్టాప్‌' కోటేశ్వరరావు, అల్లు రమేష్‌ తదితరులు నటించారు.

  సాంకేతికనిపుణులు:
  ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: మోహన్‌.కె.తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ నూకవల్లి.

  English summary
  'Manasara Manasara' a soulful lyrical sung by Sid Sriram from Tholubommalata is out and wins million hearts already. Directed by Viswanath Maganti as a complete family entertainer, Tholubommalata stars Dr. Rajendra Prasad, Viswant Duddampudi, Harshitha Chowdary, Vennela Kishore, Devi Prasad, Narra Srinivas and others in the production of Durga Prasad Maganti under Sumadurga Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X