'ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి'.. రచ్చ రేపిన సింగర్ స్మిత..ఆయన గురించేనా?

తెలుగు పాప్ సింగర్ స్మిత ఒక ట్వీట్ తో సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ రేపారు. పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని స్మిత కేవలం తనకు సంబంధించిన పాటలు లాంటి వాటిని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే సోషల్ మీడియా అకౌంట్ ని వాడుతూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం ముందుగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్మిత ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

అలాగే ఆయన విజనరీ లీడర్ షిప్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత దానికి ఏమాత్రం సంబంధం లేకుండా మరో ట్వీట్ చేశారు. ''ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి'' అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది..

ఆయనని విమర్శించినవారినేనా?

ఆయనని విమర్శించినవారినేనా?

నిజానికి ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేయకపోయినా సరే ఆమె తెలుగుదేశం పార్టీ సానుభూతిపరురాలు కాబట్టి చంద్రబాబును విమర్శించిన వారి మీద ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా ఆయనకు ప్రతిపక్షం అయిన వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆయనను ఫోర్ ట్వంటీ అని పేర్కొంటూ రెండు హ్యాష్ ట్యాగ్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బహుశా వాటి కి కౌంటర్ గానే స్మిత ఈ కామెంట్ చేసిందేమో అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదు..

ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదు..

అయితే తాను ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టలేదని, ఎందుకో ఎప్పుడూ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఇదే భావన తనకు కలుగుతుందని ఆమె మరో ట్వీట్ చేసింది. ఏనుగు వెళుతున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి అని అనిపిస్తూ ఉంటుంది అంటూ ఆమె ట్వీట్ పెట్టింది. అలాగే తాను పెట్టిన ఆ ట్వీట్ కు అసభ్యకరమైన అసహ్యకరమైన కామెంట్లు వస్తున్నాయని ఆమె పేర్కొంది. కనీసం భవిష్యత్తులో అయినా ట్విట్టర్ అనేది ఇలాంటి బూతు పదాలకు నెలవు కాకుండా ఉంటే బాగుంటుందని ఆమె ట్వీట్ చేసింది.

రంగంలోకి రెండు పార్టీల ఫ్యాన్స్

రంగంలోకి రెండు పార్టీల ఫ్యాన్స్

అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందో తెలియదు కానీ ఒక పార్టీకి చెందిన వారు ఆమెను టార్గెట్ చేయడంతో ఇప్పుడు ఈ అంశంలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఆమె చేసిన ట్వీట్స్ కింద రెండు పార్టీలకు చెందిన ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారు. అయితే అసలు ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఆమె కామెంట్ చేయడంతో ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

బాబుకు విషెస్ వెల్లువ

బాబుకు విషెస్ వెల్లువ

ఇక చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి సైతం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ''అభివృద్ధికి పాటు పడుతూ ఎంతగానో కష్టపడుతూ ఉన్నతమైన కమిట్మెంట్ కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు'', మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X