సింగర్ సోను నిగమ్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. బీజేపీ నేత ఖండన
ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌పై ముంబైలో ఓ మ్యూజికల్ నైట్ సందర్భంగా దాడి జరిగింది. సోను నిగమ్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించి తోసి వేయడంతో ఆయన కిందపడిపోయాడు. అంతేకాకుండా అడ్డు వచ్చిన సోను నిగమ్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిపై చేయి చేసుకోవడం వివాదంగా మారింది. ఈ ఘటనలో గాయపడిన గాయకుడు సోను నిగమ్‌ను స్థానిక హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
చెంబూరులోని జింఖానా మైదానంలో సోమవారం రాత్రి జరిగిన మ్యూజికల్ నైట్ సందర్భంగా ఈ ఘదటన చోటు చేసుకొన్నది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం మా దృష్టికి వచ్చింది. సోను నిగమ్ ఫిర్యాదుతో శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకాశ్ ఫతేర్‌పేకర్ కుమారుడు స్వాప్నిల్ ఫతేర్‌పేర్కర్‌పై ఐపీసీ సెక్షన్ 323, 341, 337 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం అని చెంబూరు పోలీసులు తెలిపారు.

సోను నిగమ్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. లైవ్ మ్యూజికల్ నైట్ ముగిసిన తర్వాత నేను, నా ఇద్దరు కొలిగ్స్ స్టేజ్ దిగేందుకు సిద్దమయ్యాం. అంతలోనే స్వాప్నిల్ ఫతేర్‌పేకర్ వచ్చి నా చేయి పట్టుకొన్నాడు. సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. నా కొలిగ్ హరి ప్రకాశ్ వారించగా.. ఆయనపై చేయి చేసుకొన్నాడు. ఆ తర్వాత నన్ను నెట్టివేయడంతో మెట్లపై నుంచి పడిపోయాను. ఆ తర్వాత నా మరొ కొలిగ్ రబ్బానీ ఖాన్ అడ్డువెళ్లగా ఆయనపై కూడా చేయి చేసుకొన్నాడు. మ్యూజికల్ నైట్ నిర్వాహకులు సహాయంతో స్టేజ్ వద్ద నుంచి బయటకు వచ్చాం అని తెలిపారు.
స్థానిక హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత చెంబూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్టేట్‌మెంట్‌ను సోను నిగమ్ రికార్డు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే స్వాప్నిక్ సోదరి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. జరిగిన గొడవకు క్షమాపణ చెప్పారు. నిర్వాహకుల తరఫున సోనుకు సారీ చెప్పారు. అయితే జనం ఎక్కువగా ఉండటం వల్ల గందరగోళంలో తోపులాట జరిగింది. ఆ సమయంలో తన సోదరుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకొన్నది అని చెప్పారు.
అయితే సోను నిగమ్‌పై జరిగిన దాడిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఖండంచారు. సోను నిగమ్‌పై దాడి సిగ్గు చేటు. శివసేన కాదు.. గుండాల సేన అంటూ విరుచుకుపడ్డారు.


Click it and Unblock the Notifications











