స్టార్ డైరెక్టర్ డబ్బింగ్ రూమ్‌లో అలా చేశారు.. బాలయ్య ఆ మాట అన్నారు: బయటపెట్టిన సింగర్ సునీత

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది సింగర్లుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన గాత్రంతో సుదీర్ఘ కాలంగా శ్రోతలను అలరిస్తున్నారు. అలాంటి వారిలో గాయని సునీత ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ప్రభావాన్ని చూపిస్తోన్న ఆమె.. కోయిల వంటి గాత్రంతో కొన్ని కోట్ల మందిని తన వైపునకు తిప్పుకున్నారు. అయితే, ఇప్పుడు గతంలో మాదిరిగా బిజీగా లేకున్నా.. అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలతో వస్తున్నారు. ఇలా తాజాగా సునీత ఓ చిట్ చాట్‌లో పాల్గొని కీలకమైన విషయాలను మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళ్తే...

చిన్న వయసులోనే స్టార్ట్
చిన్న వయసులో ఉన్నప్పుడే సునీత సంగీతం మీద పట్టు సాధించాలని శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాటలు పాడారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పాటలను పాడారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు తీసుకున్నారు.

Singer Sunitha Recalls Her Sweet Memory With Director Bapu and Balakrishna

భర్తకు విడాకులు ఇచ్చి

సింగర్‌గా ఎదుగుతోన్న సమయంలో సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. చాలా కాలం పాటు సవ్యంగానే సాగిన వీళ్ల కాపురంలో విభేదాలు వచ్చారు. దీంతో న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకున్న ఆమె.. కెరీర్ చూసుకుంటూనే వాళ్లను పెంచారు.

రెండో పెళ్లి చేసుకుంది
భర్తతో విడిపోయిన చాలా కాలం తర్వాత నుంచి సునీత రెండో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే ఆమె ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ ఆలయంలో సింగర్ సునీత వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత యాక్టివ్‌గా

రెండో వివాహం చేసుకున్న తర్వాత సునీత జీవితంలో జోష్ పెరిగింది. అప్పటి నుంచి ఆమె తరచూ ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. అదే సమయంలో తన కెరీర్‌ను సైతం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని సింగింగ్ షోలకు జడ్జ్‌గా చేయడంతో పాటు పలు చిత్రాలకు పాటలు పాడుతున్నారు. అలాగే, ఈవెంట్లలోనూ పాల్గొంటున్నారు.

డబ్బింగ్ రూమ్‌లో అలా
సింగర్ సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో బాపు గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన వస్తే ఎలాంటి వారైనా లేచి నిలబడతారు. అలాంటి బాపు గారు నేను ఒకసారి డబ్బింగ్ రూమ్‌కు వెళ్తే.. నన్ను చూసి లేచి నిలబడ్డారు. అంతేకాదు, నాకు నమస్కారం చేశారు. దీంతో నేను షాకయ్యాను' అని చెప్పారు.

బాలయ్య అలా అన్నారు

సింగర్ సునీత కంటిన్యూ చేస్తూ.. 'నేను షాక్ అవడంతో అక్కడే ఉన్న బాలయ్య గారు నా దగ్గరకు వచ్చి బాపు గారు నీ కలకు ఇచ్చిన గౌరవం ఇది అని అన్నారు. తర్వాత బాపు గారిని ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆయన పేరు రాసి దాని కింద నీ అభిమాని బాపు అని రాశారు. ఆరోజు జరిగిన ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను' అంటూ ఆమె గర్వంగా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X