సింగర్ సునీత రెండో పెళ్లి.. వివాహ తేది ఎప్పుడు? అతిథులు ఎవరంటే!
కొద్దికాలంగా మీడియాలో ఊహాగానాలతో వైరల్‌గా మారిన సింగర్ సునీత రెండో పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. తన నిశ్చితార్థం గురించి అభిమానులకు, ఫాలోవర్స్‌కు సర్పైజ్ ఇస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో పెళ్లి విషయాన్ని తెలియబరుస్తూ తన సంతోషాన్ని పంచుకొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా స్పందిస్తూ..
Recommended Video

అద్భుతమైన తల్లిదండ్రులు, పిల్లలు
నాకు అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులను దేవుడు ప్రసాదించాడు. నన్ను వాళ్లంతా జీవితంలో సెటిల్ కావాలని ఎప్పుడూ కోరుకొనే వారు. వాళ్లు కోరుకొన్న విధంగానే ఆ రోజు రానే వచ్చింది. ఓ ఫ్రెండ్‌గా రామ్ నా జీవితంలోకి ప్రవేశించాడు. అతడు అద్భుతమైన జీవిత భాగస్వామి. మీమిద్దరం వైవాహిక బంధంతో ఒక్కటి కావాలనుకొంటున్నాం అని సునీత్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు.

స్పెషల్ ఫీలింగ్ అంటూ
తన పెళ్లి గురించి జాతీయ ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ.. ఈ రోజు నాకు స్పెషల్ ఫీలింగ్. చాలా గర్వంగా ఉంది. ఎల్లప్పుడు అండగా నిలిచిన నా ఫ్యామిలీకి నా రుణపడి ఉంటాను. రామ్‌తో నా పెళ్లి జనవరిలో జరుగుతుంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిరాడబరంగా సాగుతుంది అని సునీత చెప్పారు.

మొదటి వివాహం గురించి
సునీత మొదటి పెళ్లి కిరణ్ కుమార్ గోపరాజుతో జరిగింది. ఆ వివాహం ద్వారా వారికి ఆకాశ్ గోపరాజు, శ్రేయా గోపరాజు అనే ఇద్దరు సంతానం కలిగారు. ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయబేధాలు తలెత్తడంతో వారి వైవాహిక బంధం విచ్ఛిన్నం అయింది. అప్పటి నుంచి ఆమె తన పిల్లల యోగక్షేమాలు చూస్తుకుంటూ ఒంటరిగానే ఉంటున్నారు.

సింగర్‌గా ఎంతోమంది అభిమానులతో
సునీత కెరీర్ విషయానికి వస్తే.. 17వ ఏటనే గాయనిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా 100కుపైగా హీరోయిన్లకు వాయిస్ అందించారు. దాదాపు 750కుపైగా చిత్రాలకు తన గొంతును అరువుగా ఇచ్చారు. ఆమె పాడిన పలు పాటలు విశేషంగా సంగీత ప్రియులను ఆకట్టుకొన్నాయి.

సునీత అవార్డులు.. రివార్డులు
ఇప్పటి వరకు తన కెరీర్‌లో సునీత 6 నంది అవార్డులను అందుకొన్నారు. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డుల కూడా ఆమె ఖాతాలో చేరాయి. ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో సునీతను సత్కరించింది.


Click it and Unblock the Notifications











