‘19 ఏళ్ల వయసులో ఒళ్లో కూర్చోబెట్టుకోలేను.. అలా ముద్దు చేస్తే బాగుండదు’
పాడుతా తీయగా షోలో తనకు అన్యాయం జరిగిందంటూ సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌పై యువ గాయని ప్రవస్తీ ఆరాధ్య చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపాయి. తనను బాడీ షేమింగ్ చేశారు. తనను సూటిపోటి మాటలతో వేధించారు. సింగర్ సునీత నన్ను టార్చర్‌కు గురి చేసిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే ప్రవస్తీ ఆరోపణలపై సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసి.. తన వాదనను వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ..
ప్రవస్తీకి అన్యాయం జరిగిందనే ఆరోపణలతో మీడియాలో జరిగిన చర్చ నా దృష్టికి వచ్చింది. రకరకాల వార్తలు ప్రచురించారు. అమ్మాయి యుట్యూబ్‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. మమ్మల్ని ఎక్స్‌పోజ్ చేసింది. అందుకే డైరెక్ట్‌గా నా పేరు వాడుతూ నాపై ఆరోపణలు చేసింది. కాబట్టి నేను ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను అని సింగర్ సునీత ఘాటుగా స్పందించారు.

ప్రవస్తీ.. నిన్ను చిన్నప్పటి నుంచి బాలు గారు, జానకీ గారు నిన్ను ఒళ్లో కూర్చోబెట్టుకొని ప్రోత్సాహించారు. నేను కూడా నిన్ను ఒడిలో కూర్చొబెట్టుకొన్నాను. కానీ నీ వయసు 19 సంవత్సరాలు. ఒళ్లో కూర్చొబెట్టుకొని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు బాగా పడితే.. ముద్దుగా పాడావనే దానిని. ముద్దుగా ఉండేదానివి. చిన్నప్పటి మాదిరిగానే ఈ వయసులో కూడా అదే తీరులో కన్సెస్టెన్సీని మెయింటెన్ చేసి ఉంటే సంతోషించే వారిలో నేను ముందు ఉండేదానిని అని సునీత పేర్కొన్నారు.
ఎవరు బాగా పడినా కరిగిపోయి ఏడ్చిన సందర్బాలు ఉన్నాయి. అవేమీ నీవు చూడలేదనుకొంటా. అలాంటి ప్రవస్తీ ఈ రోజు పెద్దదై పోయి రోడ్డు మీదకు వెళ్లి చాలా మందితో మాట్లాడి తన బాధలను వెళ్లగక్కి.. మా గురించి మాట్లాడటం అసంతృప్తిగా ఉంది. నీవు చెప్పాలనుకొన్నది చెప్పావు. కానీ నీకు పాడుతా తీయగానే కాదు.. వేరే ఛానెల్‌లో కూడా పాల్గొన్నావు. అక్కడి ప్రాసెస్ గురించి తెలియదా? అని పాటల ఎంపికపై సింగర్ ప్రశ్నించారు.
నీవు స్టేజ్‌పైకి వచ్చి పాటపడేటప్పుడు నీవైపు అదోరకంగా కొరకొరా చూసేదానివని అన్నావు. నిన్ను అలా ఎందుకు చూడాల్సిన అవసరం ఏముంది? కీరవాణి, చంద్రబోస్, నేను అలా చూశామా? అనే విషయం కూడా అర్ధం కాలేదు. కొన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. క్లాసికల్ రౌండ్‌లో నీవు అప్‌సెట్ అయితే నేను వచ్చి.. నీకు ధైర్యం చెప్పలేదా? నేను అమ్మస్థానంలో ఉండి నీకు సపోర్ట్ చేశాను. నీకే ఎందుకు ప్రోత్సాహం అందించాను అని సునీత ప్రశ్నించారు.
కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి, గెలుపు రెండు ఉంటాయి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉంటాయి. అలాగని చెప్పి ఈ రోజు ఎలిమినేషన్‌లో ఓడిపోయాను. లైఫ్‌లో ఓడిపోయానని.. ఎక్కువగా ఊహించుకొని.. ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే.. లైఫ్‌లో ఏదీ నేర్చుకోలేకపోవడానికి బ్రెయిన్ అలవాటు పడదు. సీనియర్ల పట్ల రెస్పక్ట్ ఉంది. మాకు అన్యాయం జరిగినా ఇలా మీడియాకు ఎక్కి వివాదంగా చేయలేదు. మా గురువుల నుంచి మేము నేర్చుకొన్న విద్య. ఈ జనరేషన్ ఓవర్‌గా రియాక్ట్ కాకుండా ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు మంచి విషయాలు చెప్పి వారిని సక్రమంగా పెంచాలి. గెలిచినప్పుడు కాళ్లకు దండంపెట్టి.. ఓడినప్పుడు ఇలా ఆరోపణలు చేయడం తగదు అని సింగర్ సునీత అన్నారు. సునీత వీడియోలో మాట్లాడిన పూర్తి స్పీచ్ గురించి ఈ కింది లింక్ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











