సింగర్ సునీత లేటెస్ట్ క్యూట్ ఫొటోస్.. వయసు పెరుగుతున్నా అందం అస్సలు తగ్గడం లేదు
సింగర్ సునీత గాయనిగా తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అయితే ఆమె పాటల కంటే కూడా అందానికి కాస్త ఎక్కువమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. తన క్యూట్ స్మైల్ తో గత కొన్నేళ్లుగా కుర్రాళ్ళను మంత్ర ముగ్దులను చేస్తున్న ఆమె మరోసారి పదహారేళ్ళ అమ్మాయిలా కనిపించింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండ్ అవుతున్నాయి.

20 ఏళ్ళ అనుభవం
కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సునీత దాదాపు 20 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో క్రమశిక్షణతో కొనసాగుతోంది. ఎక్కువగా కాంట్రవర్సీలను టచ్ చేయని ఈ సీనియర్ సింగర్ తనపై రూమర్స్ వస్తే మాత్రం వెంటనే కౌంటర్స్ ఇస్తుంటుంది.

పువ్వుల్లో కలిసిపోయి
ఇక సునీత తన గానంతోనే కాకుండా అందమైన నవ్వుతో కూడా ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది. అప్పుడప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ఇక ఇటీవల ఆమె ప్రకృతి వనంలో ఇచ్చిన స్టిల్స్ కూడా అందంగా ఉన్నాయి. పువ్వుల్లో కలిసిపోయి అలాంటి రంగులో ఉన్న డ్రెస్ తో దర్శనమిచ్చింది.

అబద్దమని అనిపించే వయసు
ఇక సునీత ఫొటోలను చూసిన నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గాత్రంతోనే కాదు.. అందంలో కూడా మీరు మహారాణిలా ఉన్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం సునీత వయసు 43 అయినప్పటికీ ఆమెను చూస్తే ఆ నెంబర్ అబద్దమే అనే ఆలోచన రాకుండా ఉండదు. ఎక్కువగా సునీత తన చిరునవ్వుతోనే ఆకట్టుకుంటోంది.

కూతురు కూడా సింగర్
ఇక అప్పుడప్పుడు సునీత తన ఇద్దరు పిల్లల ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఇరవై ఏళ్ళ కూతురు ఉందని చెప్పినా తెలియని వాళ్ళు అస్సలు నమ్మరు. సునీతకు కొడుకు కూడా ఉన్నాడు. ఇక కూతురు శ్రేయా గోపారాజు కూడా సింగర్ గా క్లిక్కవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె కొన్ని సినిమాల్లో కూడా పాడింది.


Click it and Unblock the Notifications











