తీవ్ర విషాదంలో ప్రముఖ గాయని.. టీవీ చూస్తూనే భర్త తిరిగి రాని లోకాలకు!
ఇండియన్ పాప్ సింగర్ ఉషా ఉతప్ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కష్ట, సుఖాల్లో తనకు అండగా నిలిచిన జీవిత భాగస్వామి జానీ చాకో ఉతప్ గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన సోమవారం రోజున కోల్‌కోతాలో చోటు చేసుొన్నది. ఆయన తన నివాసంలో టెలివిజన్ చూస్తుండగా ఛాతీలో అసౌకర్యంగా అనిపించిందని చెప్పారు. వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన తుది శ్వాస విడిచారు. హాస్పిటల్‌లో ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించారని ధృవీకరించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉషా ఉతప్ భర్త మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ గాయని ఉషా ఉతప్‌కు జానీ రెండో భర్త. టీ తోటల వ్యాపారాన్ని ఆయన నిర్వహిస్తుంటారు. 1970 సంవత్సరంలో వారిద్దరు తొలిసారి కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకొన్నారు. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన మరణాన్ని తెలుసుకొన్న సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉషా ఉతప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తెలుగులో కీచురాళ్లు అనే సినిమాలో టైటిల్ పాటను పాడి విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. 80 దశకంలో ఆమె పాడిన పాప్ సాంగ్స్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అద్బుతమైన పాపులారిటీని సంపాదించుకొన్నారు.
ఉషా ఉతప్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకొన్నారు. మ్యూజిక్ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. రంభా హో, హరి ఓం హరి, కోయి యాహ నచే నచే లాంటి పాటలు యువతను ఉర్రూతలూగించాయి. బప్పీలహరితో కలిసి డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్ సినిమాల్లో పాటలతో ఆకట్టుకొన్నారు
అలాంటి గాయని ఉషా ఉతప్ భర్త మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద సమయంలో ఆమెకు మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications