శ్యామ్ సింగరాయ్ కోసం సిరివెన్నెల రాసిన చివరి సాంగ్.. వచ్చేది ఎప్పుడంటే..?

తెలుగు చిత్రపరిశ్రమలో గేయరచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. సంగీత సరస్వతి పుత్రుడిగా ఆయన రాసిన పాటలు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ చేరిగిపోవు అనే చెప్పాలి. ఒక విధంగా పాట బ్రతికి ఉన్నంత కాలం సిరివెన్నెల పాటలు అలా పాయనిస్తూనే ఉంటాయి. ఇక సిరివెన్నెల కలం నుంచి వచ్చే ప్రతి పాటలో కూడా ఏదో సరికొత్త అర్థం భావం దాగి ఉంటుంది అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిరివెన్నెల సినిమా నుంచి కొనసాగిన ఆయన ప్రయాణం ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా వరకు అద్భుతంగా కొనసాగింది.

ఎలాంటి పాటలు సినిమా కూడా సినిమాకు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అర్థమయ్యేలా రాస్తూ ఉంటారు. ఒకవేళ కొత్త తరహా పదాలు వస్తే ఆ పాట యొక్క అర్థం తెలుసుకోవడానికి కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తారు. ఇటీవల ఆయన మృతితో కేవలం చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఎంతగానో కలత చెందారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. ఇటీవల సినీ ప్రముఖులు కూడా చాలా కన్నీటిపర్యంతమయ్యారు.

Sirivennela Sitaramasastri Shyam Singha Roy song release details

సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరిసారిగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు పాటలు రాశారు. అయితే ఇందులో ఒక పాటను మంగళవారం విడుదల చేయబోతున్నారు. ఇక సిరివెన్నెల పాటలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు నాని ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాటను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో కూడా పేర్కొన్నారు. చూస్తుంటే సిరివెన్నెల మార్క్ కు తగ్గట్టుగా ఎంతో ఆలోచింపజేసే పాట రాబోతున్నట్లు అర్ధమవుతోంది.

ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మరొక పాటను కూడా రాశారు. మరికొన్ని రోజుల తరువాత ఆ పాటను కూడా విడుదల చేయనున్నారు. నాని రెండు విభిన్నమైన పాత్రలో నటించిన ఈ పీరియడ్ మూవీలో రెండు కాలాలకు సంబంధించిన కథలు ఉంటాయట. ఇక సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ట్యాక్సీవాలా సినిమా అనంతరం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ని అందుకుంటుందని చిత్ర యూనిట్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X