Skanda: స్కంద నుంచి రాకింగ్ సాంగ్ రిలీజ్.. రామ్, శ్రీలీల ఏం చేశారు భయ్యా!
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ డిఫరెంట్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. దీనికితోడు ఆ మధ్య వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. గత చిత్రం 'ది వారియర్'తో మాత్రం నిరాశ పరిచాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'స్కంద' అనే సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
డిఫరెంట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'స్కంద' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అప్పటి నుంచి కొన్ని బ్రేకులు వచ్చినా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలా ఇప్పటికే దాదాపుగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. అయితే, కొన్ని పాటలను మాత్రం షూట్ చేయాల్సి ఉంది. వాటిని కూడా వీలైనంత త్వరగా ఫినీష్ చేసేలా ప్లాన్లు చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా తాజాగా మొదలు పెట్టేశారు. ఇందుకోసం ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న 'స్కంద' సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ నుంచి 'నీ చుట్టు చుట్టు' అంటూ సాగే ఓ రాకింగ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సంజన ఆలపించారు. దీనికి రఘురామ్ సంగీతాన్ని అందించగా.. నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ఇక, ఈ పాటలో రామ్, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. ముఖ్యంగా ఇందులో విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. మొత్తంగా ఇది చాలా కొత్తగా ఉంది.
ఇక, బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబోలో వస్తున్న 'స్కంద' సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











