పద్మ అవార్డుల ఎంపికపై ప్రముఖ గాయకుడు ఆగ్రహం.. ఆ ఇద్దరికి అర్హత లేదా? అంటూ..
బాలీవుడ్‌లో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు సోను నిగమ్ ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులపై నిరసన గళం వినిపించారు. మ్యూజిక్ వరల్డ్‌లో ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్, లెజెండరీ గాయకులను విస్మరించడంపై ఆయన నిప్పులు చెరిగారు. 2025 సంవత్సరం కోసం దేశంలో వివిధ రంగాల్లో విశేషంగా సేవలు అందించిన ప్రముఖులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొందరు సీనియర్ సింగర్లకు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాను చూసిన సింగర్ సోను నిగమ్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి ఇది పూర్తిగా అన్యాయమే అంటూ ఘాటుగా స్పందించారు. ఏ ప్రాతిపాదికన అవార్డులను ఇస్తారు? ఎలాంటి అర్హతలు చూసి పురస్కారాలకు ఎంపిక చేస్తారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగీత ప్రపంచంలో విశేషంగా రాణించిన స్వర్గీయ కిషోర్ కుమార్, అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ లాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారికి పద్మ అవార్డు ఇవ్వరా? వారి పేర్లను విస్మరించడం ఎంత వరకు సమంజసం. వారికి ఆ అవార్డులను అందుకొనేందుకు అర్హత లేదా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆయన ఏం చెప్పారంటే?
మ్యూజిక్ రంగంలో ఎంతో మంది గాయకులకు స్పూర్తిని అందించిన వారిద్దరి గురించి చెప్పుకోవాలి. అందులో ఒకరు మహ్మద్ రఫి. ఆయనను పద్మశ్రీ అవార్డుకే పరిమితం చేశాం. మరొకరు కిషోర్ కుమార్. ఆయనకుమాత్రం పద్మ అవార్డు కూడా దక్కలేదు. వారు జీవించి ఉన్నప్పుడు ఎలాగు ఇవ్వలేదు. కనీసం వారికి మరణాంతరం కూడా ఇవ్వవచ్చు కదా అంటూ వీడియోలో పేర్కొన్నారు.

తన వీడియోలో సోను నిగమ్ మాట్లాడుతూ.. సంగీత ప్రియులకు ఒక రిక్వెస్ట్. దేశంలో పద్మ అవార్డుకు అర్హత ఉన్న నటులు, గాయకులు, ఇతర కళాకారుల పేర్లను లిస్ట్ చేయండి. వారిలో పద్మ అవార్డులు రాని పేర్లను హైలెట్ చేయడం. ఇండియాలో పద్మ అవార్డులు పెండింగ్‌లో ఉన్నవారు వీరే అని సోషల్ మీడియాలో పోస్టు చేయాలని ఆయన ఘాటుగా స్పందించారు.
పద్మ భూషణ్ అవార్డు అందుకొన్న వారిలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ ఉండగా, సినీ రంగం నుంచి కర్ణాటకకు చెందిన నటుడు అనంతనాగ్ ఉన్నారు. అలాగే గాయకుడు పంకజ్ ఉదాస్ కూడా ఉండటం విశేషంగా మారింది. పంకజ్ ఉదాస్‌కు మరణాంతరం ఈ అవార్డు దక్కింది. అలాగే నటుడు అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి గాయకుడు అర్జిత్ సింగ్‌కు కూడా పద్మ అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications











