‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ సెకండ్ సింగిల్.. ‘చుక్కల చున్ని’ అంటోన్న అనురాగ్ కులకర్ణి
అనురాగ్ కులకర్ణి ఈ పేరు వినని తెలుగు సంగీత ప్రియులు ఉండరు. టాలీవుడ్ యంగ్ సింగర్లలో అనురాగ్ కులకర్ఱి ఇప్పుడు ఓ సెన్సేషన్. ఎలాంటి పాటనైనా తన గాత్రంతో మెస్మరైజ్ చేయగల గాయకుడు. పిల్లారా అంటూ అమ్మాయిపై ప్రేమను కురిపించినా.. ఆషా పాశం అంటూ జీవితంలోని విరహ వేదనను వినిపించినా అది అనురాగ్ కులకర్ణికే సొంతమైంది. రాములో రాముల అంటూ చిందులు వేయించాలన్నా అనురాగ్ వల్లే సాధ్యమైంది.
అనురాగ్ కులకర్ణి, సంగీత దర్శకుడు చైతన్య భరద్వాజ్ కాంబోలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పిల్లా రా అనే పాట యూత్‌ను ఫిదా చేసేసింది. అలాంటి ఓ అద్భుతమైన పాటే మళ్లీ వచ్చింది. ఈ కాంబోలో భాస్కర భట్ల రాసిన 'చుక్కల చున్ని'అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. అనురాగ్ గాత్రంతో ఈ పాట అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ చూసాలే కళ్లారా బాగానే క్లిక్ అయింది.

సెకండ్ సింగిల్ రిలీజ్ చేసిన సందర్భంగా నిర్మాతలు ప్రమోద్, రాజు మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం మెదటి చిత్రం రాజా వారి రాణి గారు మాకు చాలా బాగా నచ్చింది. ఈ లాక్‌డౌన్ లో అమెజాన్ ప్రైమ్ లో మోస్ట్ వ్యూయర్ షిప్ వున్న టాప్ 5 చిత్రాల్లో ఈ చిత్రం కూడా వుందంటే కిరణ్ ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకున్నాడో చెప్పనక్కర్లేదు. కిరణ్‌తో రెండవ చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం చేయటం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రానికి సంబందించిన మెదలి లుక్, మెదటి సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











