Pushpa 2 Kissik song : సమంత సమంతే.. తేలిపోయిన శ్రీలీల .. కిక్ ఇవ్వని కిస్సిక్
సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇపుడు స్పెషల్ సాంగ్స్ గా మారిపోయినా వాటికి ఉన్న క్రేజ్ సెపరేట్ గా ఉంటుంది అని చెప్పాలి. ఎప్పటి నుంచో సినిమాల్లో ఐటెం సాంగ్స్ వుంటూనే ఉన్నాయి కానీ కాలం మారుతున్న కొద్దీ వీటికి కూడా ట్రెండ్ మారిపోయింది. ఒక పది ఇరవై ఏళ్ల క్రితం వరకు కూడా ఐటెం సాంగ్స్ అంటే దానికి సెపరేట్ గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అంతెందుకు విదేశాల నుంచి తెల్ల తోలు బ్యూటీ లని దింపే వారు ఇదే ట్రెండ్ అలా కొన్నేళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది.
కానీ ఒక్కసారిగా ఇది హీరోయిన్స్ వైపు మళ్లింది. అప్పటికే స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవారిని పలు స్టార్ హీరోల సినిమాల్లో దర్శకులు ఐటెం భామలుగా మార్చేయడం స్టార్ట్ చేసారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి మరింత ఆదరణ వచ్చింది. అంతే అక్కడ నుంచి మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో షేక్ చేసిన ఐటెం సాంగ్స్ కొన్నే ఉంటే ఆ కొన్నింటిలో కూడా డెఫినెట్ గా కనిపించే సినిమానే "పుష్ప 1".

ఈ సినిమా కోసం సెన్సేషనల్ బ్యూటీ సమంతని అప్పుడు రంగంలోకి దింపారు. అయితే అప్పటికి సమంత లోకల్ బ్యూటీనే , కానీ ఆ సాంగ్ లో చూపించిన హాట్ నెస్ తో సమంత ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. అప్పటి వరకు పలు సినిమాల్లో గ్లామర్ షో చేసినా కానీ పుష్ప 1 ఐటెం సాంగ్ మాత్రం ఇంకో ఎత్తు అని చెప్పాలి.
అప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. వాళ్ళు సెట్ చేసిన ట్రెండ్ కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి దానిని సమంత ఈజీగా మ్యాచ్ చేసింది. కానీ ఇపుడు పెద్ద టాస్క్ పుష్ప 2 కి వచ్చింది. ఈ సినిమాలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి చాలా మంది పేర్లు వచ్చి ఫైనల్ గా శ్రీలీల దగ్గర ఆగింది.
అయితే చాలా మంది డౌట్స్ పెట్టుకున్నారు కానీ ఎక్కడో చిన్న హోప్ కూడా ఉంది. అలానే పార్ట్ 2 కాబట్టి సమంతని కూడా డామినేట్ చేసేస్తుంది అని కూడా కామెంట్స్ వినిపించాయి. కానీ ఇపుడు సాంగ్ వచ్చింది సీన్ కట్ చేస్తే సమంతని డామినేట్ చేయడం అటుంచితే సామ్ చూపించిన గ్రేస్ అండ్ హాట్ నెస్ లో ఇంచ్ కూడా శ్రీలీల మ్యాచ్ చెయ్యలేకపోయింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అపుడు లిరికల్ లో సామ్ పై వీడియో విజువల్ కూడా ఇవ్వలేదు కేవలం కొన్ని మోషన్ పోస్టర్స్ మాత్రమే ఆ సాంగ్ లో కనిపిస్తాయి. కానీ ఇపుడు పార్ట్ 2 సాంగ్ లో శ్రీలీలపై వీడియో విజువల్స్ కూడా వదిలినప్పటికీ సమంతని మాత్రం ఆమె ఎక్కడా మ్యాచ్ చేసిన ఆనవాళ్లే కనిపించడం లేదు.
డాన్స్ బిట్స్ కూడా మేకర్స్ పెద్దగా వదల్లేదు. ఇక సామ్ లోని హాట్ నెస్ కూడా శ్రీలీలలో కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే బన్నీ దగ్గర శ్రీలీల చాలా చిన్న పిల్లలా ఉందని చెప్పక తప్పదు. మరి సమంతనా శ్రీలీలనా అనే డిబేట్ కి వస్తే పుష్ప రెండు సినిమాల్లో ప్రేక్షకులు డెఫినెట్ గా యునానిమస్ గా సమంతకే జై కొడతారని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











