Sreemukhi నీకు బ్రేకప్స్ గుర్తుండవా? శ్రీముఖికి షాకిచ్చిన టాప్ సింగర్

టెలివిజన్, ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రియాలిటీ షోలు జోరందుకొన్నాయి. గేమ్ షోలు, సింగింగ్ కాంపిటీషన్స్‌తో న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సెలబ్రిటీలు రంగంలోకి దిగుతున్నారు. ఆ క్రమంలోనే స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో సూపర్ సింగర్ షో రసవత్తరంగా సాగుతున్నది. ఈ షోలో తాజాగా శ్రీముఖి, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ అయింది. ఆ కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో ఇటీవల స్టార్ట్ అయిన సూపర్ సింగర్ షోకు భారీగా ఆదరణ దక్కుతున్నది. ఈ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. అనంత శ్రీరాం, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, సింగర్ శ్వేత న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో అనంత్ శ్రీరాం తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నారు.

Sreemukhi gets Shocking comments from lyric Writer Ananth Sriram in Super Singer Reality Show

ఇక సూపర్ సింగర్ షోలో అనంత్ శ్రీరాం చూపించే హవభావాలు, చిలిపి పనులు, అల్లరి కంటెస్టెంట్లు, జడ్జీలకే కాకుండా చూసే ప్రేక్షకులకు ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతున్నది. అయితే కంటెస్టెంట్లను ప్రోత్సాహించే ఆయన మాటలు మరింత స్పూర్తిని, ఉద్వేగానికి గురి చేస్తుంటాయి. తాజా ఎపిసోడ్‌లో అనంత్ శ్రీరాం అల్లరికి కొదవేం కనిపించలేదనేటట్టు అనిపించింది.

Sreemukhi gets Shocking comments from lyric Writer Ananth Sriram in Super Singer Reality Show

ఇక తాజా సూపర్ సింగర్ ఎపిసోడ్ ప్రోమోలో అనంత శ్రీరామ్ విసిరిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఓ కంటెస్టెంట్ ఆర్య 2 సినిమాలోని మై లవ్ గాన్ పాటకు ఆయన స్పందిస్తూ.. ఎనర్జీకి నిలువెత్తు నిదర్శనం అంటూ కామెంట్ చేశాడు. అలాగే మరో కంటెస్టెంట్ గురించి చెబుతూ.. సినిమాలో రెండు పాత్రలు చేస్తే ద్విపాత్రాభినయం అంటారు.. మీరు పాట పడుతుంటే.. ద్విగాత్రాభినయం చేస్తున్నట్టు అనిపించింది.

ఇదిలా ఉండగా, మై లవ్ ఈజ్ గాన్ పాట అనంతరం శ్రీముఖిని ఆటపట్టిస్తూ.. ఈ సాంగ్‌కు నీకు, నాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది.మీకు గుర్తుందా? అంటే.. నాకు గుర్తు లేదు. మీరు గుర్తు చేయండి అంటూ శ్రీముఖి సమాధానం ఇచ్చింది. అయితే మీకు బ్రేకప్స్ గుర్తుండవు కదా అని అనంత శ్రీరామ్ అనగానే.. వెంటనే ఆమె గుండెల మీద చేయేసుకొని సిగ్గుపడింది.

Sreemukhi gets Shocking comments from lyric Writer Ananth Sriram in Super Singer Reality Show

ఆ తర్వాత సూపర్ సింగర్ వేదికపై అనంతరామ్ తనదైన శైలిలో ఫ్లోర్ మూమెంట్ చేసి కేక పెట్టించారు. ఆర్య 2 పాటలో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ తరహాలోనే ఆయన స్టెప్పులు వేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. తాజా ప్రోమో త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్‌పై ఆసక్తిని రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X