శ్రీనివాస కళ్యాణం టీజర్, ఆడియో వేడుకకు ముహూర్తం ఫిక్స్!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ చిత్రం విడుదలైన 15 ఏళ్ల తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి దిల్ రాజే నిర్మాత. ఆగష్టు 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. రేపు(గురువారం జులై 19) ఉదయం 9 గంటలకు శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేయనున్నారు. అదే సమయంలో ఆడియో వేడుక తేదీని కూడా ప్రకటించనుండడం విశేషం. వివాహ బంధం గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఈ చిత్రం ఉండనుంది.

Srinivasa Kalyanam teaser will release tomorrow

నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నందిత శ్వేతా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X