RRR దోస్తీ సాంగ్: మైండ్ బ్లోయింగ్.. ఫ్యాన్స్ గుండెల్లో వైబ్రేషన్స్ వచ్చేలా.. పాట చివరలో ట్విస్ట్..

దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రూపొందుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR అసలు హంగామా మొదలైంది. ఈ మూవీ కోసం అభిమానులే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. దేశ సినిమా చరిత్రలోనే ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కానుంది. ఇక కీరవాణి కంపోజ్ చేసిన అసలైన పాన్ ఇండియా సాంగ్ అభిమానులను గుండెల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. రాజమౌళి ఫస్ట్ లుక్ టీజర్స్ తోనే సాలీడ్ బజ్ క్రియేట్ చేయగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సినిమా స్థాయిని మరింత పెంచుతున్నారు.

Recommended Video

RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
ట్రెండ్ సెట్టర్ మూవీ

ట్రెండ్ సెట్టర్ మూవీ

మెగా స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొట్ట మొదటి సినిమా కావడంతో ఈ బిగ్ మల్టీస్టారర్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ లో చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలోని పాత్రలు ఏ రేంజ్ లో ఉంటాయో ఎవరి ఊహలకు అర్థం కావడం లేదు.

మరో లెవెల్ కు తీసుకువెళుతున్న కీరవాణి

మరో లెవెల్ కు తీసుకువెళుతున్న కీరవాణి

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు స్నేహితులుగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహలకు ప్రాణం పోస్తున్న జక్కన్న తప్పకుండా అభిమానులను అంచనాలను అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇప్పటికే పోస్టర్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేయగా సంగీత దర్శకుడు కీరవాణి తన పాటతో మరో లెవెల్ కు తీసుకువెళ్లబోతున్నారు.

అభిమానుల గుండెలను తాకేలా

మొత్తానికి సినిమా ఫస్ట్ సాంగ్ ను ఆగస్ట్ 1న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. దోస్తీ అనే ఈ పాటతో కీరవాణి అన్ని వర్గాల అభిమానుల గుండెలను తాకడమే కాకుండా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాడు. ఈ పాటను 5 భాషల్లో 5 మంది డిఫరెంట్ సింగర్స్ తో పాడించడం స్పెషల్ గా నిలిచింది. పాట కోసం ప్రత్యేకంగా మేకింగ్ వీడియోను కూడా చేశారు.

ఐదు మంది సింగర్స్ తో సరికొత్తగా..

ఐదు మంది సింగర్స్ తో సరికొత్తగా..

ఈ సాంగ్ ను తెలుగులో హేమచంద్ర పాడగా, తమిళ్ లో అనిరుధ్ రవిచంద్రన్, ఇక హిందీలో అమిత్ త్రివేది, మళయాళంలో విజయ్ యేసుదాస్, కన్నడలో యాజిన్ నిజార్ వంటి టాలెంటెడ్ గాయకులు ప్పాడారు. దీంతో ఈ పాట ప్రతి భాషలో సినీ ప్రేక్షకులకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతోంది. నెంబర్ వన్ పాన్ ఇండియా సినిమాకు నెంబర్ వన్ సాంగ్ అనేలా కంపోజ్ చేశారు.

సాంగ్ లో ట్విస్ట్..

సాంగ్ లో ట్విస్ట్..

ఇక సాంగ్ చివరలో మెగా స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి రావడం సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. కీరవాణి భుజంపై చేయి వేసిన ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా స్టిల్స్ ఇచ్చారు. చూస్తుంటే సినిమా అంచనాల స్థాయికి ఇంకాస్త ఎక్కువగానే రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్ధమవుతోంది.

టెన్షన్ ఉంటుంది...

టెన్షన్ ఉంటుంది...

ప్రతి పాట పాడేముందు సరిగ్గా పాడతామా లేదా అనే టెన్షన్ ఉంటుంది. ఇక ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విషయంలో నాకు ఇంకాస్త ఎక్కువ ఒత్తిడి ఉండేది. ప్రమోషనల్ షూట్ అనేసరికి షాక్ అయ్యాను. సాంగ్ ను షూట్ చేసిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్. సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ కూడా బ్యూటీఫుల్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X