రాజమౌళి సిస్టర్ ను ఎప్పుడైనా ఇలా చూశారా.. వాళ్ళ ఫ్యామిలీలో భిన్నంగా హీటెక్కించే గ్లామర్ తో స్టన్నింగ్!

దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబంలో దాదాపు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నవారే. మ్యూజిక్ అలాగే రైటింగ్ డైరెక్షన్ సింగర్స్ యాక్టర్స్ ఇలా అందరూ కూడా ఆ ఫ్యామిలీలో ఉన్నారు. అయితే రాజమౌళి సోదరి మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ తో ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఆమె మరెవరో కాదు కీరవాణి సోదరి MM శ్రీలేఖ. ఆమె సంగీత దర్శకురాలిగా అందరికీ పరిచయమే. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు శ్రీలేఖ గ్లామరస్ ఫోటోలతో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇక ఇటీవల బాగా వైరల్ అయిన కొన్ని ఫోటోల వివరాల్లోకి వెళితే..

ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి..

ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి..

రాజమౌళి తండ్రి కె విజయేంద్ర ప్రసాద్ మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత మిగతా వారి కెరీర్ కు కూడా ఎంతగానో దోహదపడ్డారు. ఇక కీరవాణి ప్రత్యేకంగా ఫ్యామిలీ బాధ్యతలను తీసుకుని ఉమ్మడి కుటుంబం గా జీవించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తర్వాత రాజమౌళి దర్శకుడిగా మారడంతో వారి స్థాయి మరింత పెరిగిపోయింది అని చెప్పాలి.

చిన్న వయసులోనే సంగీతం

చిన్న వయసులోనే సంగీతం

ఇక రాజమౌళి కుటుంబంలో రచయితలు సంగీత దర్శకులు సింగర్స్ కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ అలాగే సోదరి ఎం ఎం శ్రీలేఖ ఇద్దరు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు. శ్రీలేఖ తన 13 ఏళ్ల వయసులోనే కంపోజింగ్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. ఆ తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాకు ఆమె వర్క్ చేసుకుంటూ వచ్చింది.

తెలుగులోనే కాకుండా అక్కడ కూడా..

తెలుగులోనే కాకుండా అక్కడ కూడా..

ఎం ఎం శ్రీలేఖ ఒకానొక సమయంలో అయితే కొంతమంది మీడియం రేంజ్ దర్శకులతో రెగ్యులర్ గా వర్క్ చేసుకుంటూ వచ్చారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆమె తమిళం మలయాళం కన్నడ అలాగే హిందీలో కూడా మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు. ఇటీవల వచ్చిన హిట్ 2 సినిమాలోని ఒక పాటకు కూడా ఆమె మ్యూజిక్ అందించారు. ఆ విధంగా శ్రీలేఖ ఇండస్ట్రీలో బిజీగా మారుతొంది.

పర్సనల్ విషయాల గురించి చెప్పకుండా..

పర్సనల్ విషయాల గురించి చెప్పకుండా..

ఎంఎం శ్రీలేఖకు రాజమౌళి కీరవాణి ఇలాంటి దిగ్గజాల సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఎనాడు ఆమె వారి నుంచి అవకాశాలు అందుకోలేదు. కేవలం తన సొంత టాలెంట్ ద్వారానే సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె పెళ్లి విషయంలో అలాగే ఇంతవరకు పెద్దగా ఎక్కడ క్లారిటీ ఇచ్చింది లేదు. గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆమె పర్సనల్ విషయాలను అయితే ఏ ఇంటర్వ్యూలోను చెప్పుకోలేదు.

గ్లామర్ తో షాక్ ఇచ్చేలా..

గ్లామర్ తో షాక్ ఇచ్చేలా..

ఇక ఎం ఎం శ్రీలేఖ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటారు. ఆమె ఒక ఫోటోలో అయితే హీరోయిన్స్ తరహాలోనే ఫోటోలకు స్టిల్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే జీన్స్ టీషర్ట్స్ ఇలా మోడ్రన్ డ్రస్సులలో కూడా అప్పుడప్పుడు షాక్ ఇస్తూ ఉంటారు. ఇక దర్శకుడు రాజమౌళి కుటుంబంలో ఆమె కొంత ప్రత్యేకంగా కూడా కనిపిస్తుంటారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 రాజమౌళి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు..?

రాజమౌళి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు..?

చాలాకాలంగా శ్రీలేఖకు అలాగే వారి సోదరులు రాజమౌళి కీరవానికి మధ్యలో విభేదాలు ఉన్నాయని ఆ కారణంగానే శ్రీలేఖకు వారి సినిమాలలో అవకాశాలు ఇవ్వడం లేదు అని చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని.. నేను అవసరం అయితే రాజమౌళి గారే నన్ను ఏదో ఒక పనిలో పెట్టుకుంటారు అని అనవసరంగా ఆయన ఎవరిని కావాలని సినిమాల్లో ఉంచుకోరు అని ఆమె చాలా సింపుల్ గా ఒక వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X