twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అఖండ' కోసం 600 మంది మ్యూజిషియన్లు.. 1.83కోట్ల మ్యూజిక్ బిల్లు.. కాపీ వెనుక అసలు విషయం ఇదే!

    |

    మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా అఖండ సినిమాకు ఆయన ఆంచిందిన మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మ్యూజిక్ గురించి థమన్ తాజాగా వచ్చిన అలీతో సరదాగా ప్రోగ్రాంలో స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

    బాగా ప్లస్ అయింది

    బాగా ప్లస్ అయింది

    స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ' సినిమాతో ఘన విజయం సొంతం చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. కరోనా కాలంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు బాలయ్య. డిసెంబర్‌ 2న విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్‌ దండయాత్రను ముగించుకుని ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. సంక్రాంతి తర్వాత జనవరి 21న డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని హాట్‌ స్టార్‌ అధికారికంగా వెల్లడించింది.

    బాగా ప్లస్ అయింది

    బాగా ప్లస్ అయింది


    అయితే ఈ సినిమాలో థమన్ అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. ఈ సినిమాలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ అఖండ సినిమా అమెరికా థియేటర్లలో సౌండ్‌ తగ్గించారట. అంత భారీ సౌండ్‌తో సంగీతం అందించారు కదా? దానికి శిక్షణ ఏమైనా తీసుకున్నారా? అని అలీ ప్రశ్నిస్తే అది అంతా హీరోల మీద ఉండే అభిమానమే అని చెప్పుకొచ్చారు. అందరూ సౌండ్‌ గురించే అడుగుతున్నారని ఆయన అన్నారు.

    32 రోజులు పట్టింది

    32 రోజులు పట్టింది

    ఇక గుడిలో హారతి ఇచ్చే సమయంలో డ్రమ్స్‌, గంటలు మోగిస్తారు కదా.. ఆ సౌండ్‌ తగ్గించమని అడుగుతామా? ఆ సినిమాలో బోయపాటి గారు బాలకృష్ణ గారిని అలా చూపించారు. ఆ విధంగా మ్యూజిక్‌ కొట్టాల్సిందేనని అన్నారు. బోయపాటికి స్పష్టమైన విజన్‌ ఉంటుంది. 'అఖండ' ఇంటర్వెల్‌ సీన్‌కు ఆర్‌ఆర్‌ చేయడానికి 32 రోజులు పట్టిందని ఆయన అన్నారు. అఖండ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, సినిమా చూస్తే మీకు చెవులు నొప్పి పెట్టవు, కేవలం మీలోకి దేవుడు ఆవహిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

    ఎంత కష్టపడుతున్నానో

    ఎంత కష్టపడుతున్నానో

    థమన్ ఎక్కువగా కాపీ కొడతాడు అని కొందరు చేసిన విమర్శలు విన్నప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటని అడిగితె నా దర్శకులు, నిర్మాతలు, హీరోలు నన్ను నమ్మినప్పుడు విమర్శలు చేసేవాళ్ల గురించి నాకెందుకు అని ఆయన ప్రశ్నించారు. నేను ఎంత కష్టపడుతున్నానో దర్శకులు, హీరోలు, రచయితలు, గాయకులు చూస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చింది. ఒక్కటే ఆలోచిస్తా, సినిమా అనేది అన్ని క్రాఫ్టులకు సంబంధించినది. నా వెనుక వంద మంది కష్టపడితేనే అవుట్‌పుట్‌ వస్తోందని పేర్కొన్నారు.

    Recommended Video

    Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
    600 మంది మ్యూజిషియన్లు

    600 మంది మ్యూజిషియన్లు

    'అఖండ' చిత్రం కోసం దేశవ్యాప్తంగా 600 మంది మ్యూజిషియన్లు పనిచేశారు, వారికి మంచి జీతాలు అందాయని, మ్యూజిక్‌ బిల్లు రూ. 1.83కోట్లు వచ్చిందని అన్నారు. తాను ఒక లారీ డ్రైవర్ ను అని నా పేరుతో వాళ్ళకి డబ్బు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. అందరం కలిసి చేశామని పేరు మాత్రమే తనకు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ విమర్శలను నేను అస్సలు పట్టించుకోనన్న ఆయన ఎందుకంటే ప్రపంచం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసని అన్నారు.

    English summary
    Ss Thaman made comments About Akhanda Movie music
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X