గుండె బద్దలయింది..భగవంతుడా బలాన్నివ్వు, ఇది పోస్ట్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగడం లేదు..తమన్ ఎమోషనల్ ట్వీట్!

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే గతంలో లాక్ ఆన్ సమయంలో ఎలా అయితే జనం సాయం మీద ఆధారపడిన వృద్ధులు, యాచకులు అవస్థలు పడుతున్నారో ఇప్పుడు కూడా అలాగే అవస్థలు పడే పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. తాజాగా దీనికి సంబంధించి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒక వీడియో షేర్ చేశారు.

ఆ వీడియోలో ఒక వృద్ధ మహిళకు ఔత్సాహికులు ఆహారం అందిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆహారం అందించగా ఆమె దండం పెడుతూ తన దగ్గర ఉన్న పదో పరకో తనకు ఆహారం అందించిన వ్యక్తి చేతిలో పెట్టడానికి చూసింది. అయితే దానిని వద్దన్న సదరు వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వీడియోని షేర్ చేసిన తమన్ ఈ వీడియో చూస్తుంటే తన గుండె ముక్కలు అవుతోందని చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో చూశాక తనకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని అనిపిస్తోందని దాన్ని వీలైనంత త్వరలో కడతానని దాన్ని నిర్మించడానికి భగవంతుడు తనకు బలం ఇవ్వాలని ఆయన కోరారు. అంతే కాదు ఇదంతా టైప్ చేస్తున్నా సరే తనకు కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నాడు. దయచేసి ఆ ఆహారాన్ని వృధా చేయవద్దని తమన్ కోరాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించి మనుషులుగా మనం అంటే ఏమిటో చాటి చెబుతామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతానికి తమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి.

 SS Thaman wanted to build an old age home soon

గత ఏడాది అలవైకుంటపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన ఆయన, ఈ ఏడాది కూడా క్రాక్, వైల్డ్ డాగ్, వకీల్ సాబ్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. మరీ ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాకి తమన్ అందించిన పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇక మరో పక్క బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ అనే సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అంతేకాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మలయాళం రీమేక్ సినిమాకి కూడా ఆయన మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇవి కాకుండా హిందీ సూర్య వంశీ సినిమాకి అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీశ్, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X