ట్రెండింగ్‌గా సామజవరగమన.. అదరగొట్టిన సిద్ శ్రీ రామ్, తమన్, సిరివెన్నెల
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను చూస్తే ఓ మ్యాజిక్ గుర్తొస్తుంటుంది. సినిమాలోని డైలాగ్స్ అయినా, అల్లు అర్జున్ మ్యానరిజమైనా.. ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకంగానే నిలుస్తాయి. అయితే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మరోసారి మాయచేసి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

నా పేరు సూర్య దెబ్బతో చాలా గ్యాప్..
ఎన్నో అంచనాలతో నా పేరు సూర్యను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన అల్లు అర్జున్కు నిరాశ మిగిలింది. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా అంతలా బెడిసి కొట్టేసరికి.. మరో ప్రాజెక్ట్ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనివల్ల చాలా గ్యాప్ వచ్చేసింది.

ఒక్క డైలాగ్తో విమర్శకులకు పంచ్..
ఎన్నో తర్జనభర్జనల తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే టైటిల్ రివీల్ చేసే టీజర్లో బన్నీ చెప్పిన ఒక్క డైలాగ్ అన్నింటికి సమాధానం చెప్పింది. ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్.. అని తండ్రి పాత్రలో ఉన్న మురళీ శర్మ అంటే.. ఇవ్వలేదు.. వచ్చింది అంటూ తన దైన శైలీలో అందరికీ కౌంటర్ వేశాడు.

సామజ వరగమన అంటూ ట్రెండింగ్..
అరవింద సమేతలాంటి మ్యూజికల్ హిట్ తరువాత మళ్లీ త్రివక్రమ్, తమన్ కాంబినేషన్లో అల వైకుంఠపురములో రాబోతోంది. అరవింద సమేతకు మ్యూజిక్ ఎంత సపోర్ట్గా నిలిచిందో.. ఈ సినిమాకు కూడా తమన్ అందించే సంగీతం అంతే ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అందులో భాగంగా రిలీజ్ చేయనున్న సామజవరగమన అనే పాట రిలీజ్ కాకముందే ట్రెండింగ్లోకి వచ్చేసింది.

సిద్ శ్రీరామ్ గాత్రంలో ఒదిగిపోయిన పాట..
ఈ మధ్య కాలంలో ఏవైనా పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయంటే..అవి సిద్ శ్రీరామ్ గొంతులోంచి వచ్చినవే. ఇంకేం ఇంకేం కావాలే, మాటే వినదుగా, ఉండిపోరాదే లాంటి సూపర్ హిట్ చిత్రాలు పాడాడు. ఆ జాబితాలోకి చేరే మరో బ్లాక్ బస్టర్ సాంగ్ సామజవరగమన అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..

తమన్ బాణీ.. సిరివెన్నెల సాహిత్యం..
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు అంటూ సాగే ఈ పాట ట్విటర్ ట్రెండింగ్లో టాప్ ప్లేస్లోకి వచ్చిందంటే.. ఆ పాటపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉదయం పది గంటలకే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటకు తమన్ అందించిన బాణీ ఎంత బాగుందో.. సిరివెన్నెల అందించిన సంగీతం అంతకంటే బాగుంది. ఈ పాట రిలీజైన కొద్ది క్షణాల్లోనే లక్ష వ్యూస్ ను క్రాస్ చేసింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











